రూ.10,000 కంటే తక్కువ ధరలో శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ..!
టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung India) గత సంవత్సరం ఎంట్రీ లెవల్ ధరలో అనేక హ్యాండ్‌సెట్‌లను విడుదల చేసింది. అంటే రూ.10,000 కంటే తక్కువ ధరలో మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగిన ఫోన్‌లను తీసుకొచ్చింది. F, M సిరీస్‌లో ఈ ఫోన్‌లను లాంచ్ చేసింది. అయితే తాజాగా శాంసంగ్ నుంచి మరో కీలక ప్రకటన విడుదల చేసింది. F సిరీస్‌లో మరో హ్యాండ్‌సెట్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ ను (Samsung Galaxy F06 5G) ఫిబ్రవరి 6 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ హ్యాండ్‌సెట్ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లను కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ :
గెలాక్సీ F06 5G హ్యాండ్‌సెట్ ఫ్లాట్ ఎడ్జ్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ బహామా బ్లూ, లిట్ వైలెట్ వంటి రెండు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
చిప్‌సెట్ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ చిప్‌సెట్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. గెలాక్సీ F06 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 5G ను సపోర్టు చేస్తుంది. మొత్తం 12 5G బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. రోజువారీ టాస్క్‌లను పూర్తి చేసేందుకు ఈ ప్రాసెసర్ అనుకూలంగా ఉంటుందని సంస్థ చెబుతోంది.
4 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 4GB ర్యామ్, 6GB ర్యామ్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.
50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను ఉండనున్నాయి. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంటుంది. ఇతర కెమెరా ఫీచర్‌ల వివరాలు తెలియాల్సి ఉంది.
బ్యాటరీ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు కాల్ క్లారిటీ కోసం ఈ ఫోన్.. వాయిస్ ఫోకస్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇతర కనెక్టివిటీ ఫీచర్‌ల వివరాలు తెలియాల్సి ఉంది.
ధర ఎంత :
ఈ హ్యాండ్‌సెట్ ధరపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ రూ.10,000 కంటే తక్కువ ధరకు విడుదల కానుందని తెలుస్తోంది. ఫలితంగా తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే 5G హ్యాండ్‌సెట్‌గా నిలిచే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. మిగిలిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు సహా ధర వివరాలు వెల్లడి కానున్నాయి. దీంతోపాటు సేల్ వివరాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. ఫిబ్రవరి 12 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications








