రూ.7499 కే 5G స్మార్ట్‌ఫోన్.. 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్, 50MP కెమెరా సహా సూపర్ ఫీచర్లు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ ఈ సంవత్సరం తొలిరోజుల్లో రూ.10 వేల కంటే తక్కువ ప్రారంభ ధరతో శాంసంగ్ గెలాక్సీ M06 5G, గెలాక్సీ F06 5G, A సిరీస్‌లో మరో హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఫోన్‌లు తక్కువ ధరకు అందుబాటులోకి రాగా.. పండుగల సీజన్ సేల్‌లో భాగంగా మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. రూ.10 వేల కంటే తక్కువ ధరలో 5G ఫోన్ కోసం చూస్తున్నవారికి శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్‌లో (Flipkart Big Billion Days 2025) భాగంగా భారీ తగ్గింపు ధరకు గెలాక్సీ F06 5G మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11499 గా ఉండేది.

రూ.7,499 కే 5G స్మార్ట్‌ఫోన్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 4GB/64GB ధర రూ.7,499, 4GB/128GB ధర రూ.7,999, 6GB/128GB ధర రూ.8,999 గా ఉంది. దీంతోపాటు ICICI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ లిట్ వైలెట్, Bahama బ్లూ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు ;
ఈ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F06 5G Smartphone) 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ గెలాక్సీ F06 5G హ్యాండ్‌సెట్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 పైన పనిచేస్తోంది. తక్కువ ధరలో అందుబాటులోకి వస్తున్నా గానీ ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు 4 సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను అమర్చి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. మరియు వెనుక వైపు LED ఫ్లాష్ లైట్ కూడా అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాతో అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పరంగా 12 5G బ్యాండ్స్‌తోపాటు, 4G, బ్లూటూత్ 5.3, WiFi, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ Knox vault, క్విక్ షేర్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








