Home
Mobile

రూ.8499 ధరకే 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ 5G ఫోన్‌..!

శాంసంగ్‌ రూ.10 వేల కంటే తక్కువ ధరలో అనేక మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy F06 5G Smartphone) విడుదల అయింది. ఈ ఫోన్‌ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ పొందుతుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

ధర, సేల్‌ వివరాలు :
విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.11499 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ ఫోన్ 4GB/64GB వేరియంట్ ధర రూ.8499, 4GB/128GB ధర రూ.9499 గా ఉంది.

samsung galaxy f06 5G smartphone

కలర్‌ వేరియంట్స్‌ :
ఈ ఫోన్ 6GB/128GB స్టోరేజీ వేరియంట్‌ రూ.10999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ లిట్‌ వైలెట్‌, Bahama బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ పైన పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు 4 సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలతో అందుబాటులో ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. వెనుక వైపు LED ఫ్లాష్‌ లైట్‌ను కూడా అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP సెల్ఫీ కెమెరాను కొనుగోలు చేయవచ్చు.

ఫాస్ట్‌ ఛార్జింగ్ :
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ధరలో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు మెరుగైన ఫీచర్‌గానే పరిగణించవచ్చు. దీంతోపాటు ఈ ఫోన్‌లో వాయిస్‌ ఫోకస్‌ ఫీచర్‌ను కూడా అందించారు. ఈ ఫీచర్‌ కాల్‌ క్వాలిటీని మెరుగుపరుస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం 5G, 4G, బ్లూటూత్‌ 5.3, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ Knox vault, క్విక్‌ షేర్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
samsung galaxy f06 5G smartphone now available at rs8499 on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X