రూ.9999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లే శాంసంగ్ 5G ఫోన్.. సేల్ ప్రారంభం..!
శాంసంగ్ నుంచి ఇటీవల గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.10,000 కంటే తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ప్రారంభ సేల్ లో భాగంగా రూ.500 తగ్గింపును పొందవచ్చు. 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంది. రెండు కలర్ వేరియంట్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ ధర :
భారత్ మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F06 5G Smartphone sale) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం అయింది.

డిస్కౌంట్ వివరాలు :
శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ఫిఫ్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ లో భాగంగా ICICI, యాక్సెస్ బ్యాంకుల క్రెడిట్ కార్డులపై రూ.500 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ బహమా బ్లూ, లిట్ వైలెట్ వంటి రెండు రంగుల్లో లభిస్తుంది. తక్కువ ధరలో బెస్ 5G స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూసే వారికి ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ అనుకూలంగా ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. మరియు ఈ డిస్‌ప్లే 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ముందు, వెనుక వైపు ప్యానళ్లు ఆకట్టుకుంటాయి. ఈ ఫోన్ గ్లోసీ బ్యాక్ ప్యానల్ ను కలిగి ఉంది.

4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 పైన పనిచేస్తుంది. దీంతోపాటు ఎక్కువ రోజులపాటు ఫోన్‌ను వినయోగించుకొనే విధంగా 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది.
డ్యూయల్ కెమెరాలు :
గెలాక్సీ F06 5G హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలతో అందుబాటులో ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ లను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రైమరీ కెమెరా f/1.8 అపేచర్ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు.
5000mAh బ్యాటరీ :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు శాంసంగ్ Knox Vault, కాల్ క్వాలిటీ కోసం వాయిస్ పోకస్, క్విక్ షేర్ ఫీచర్‌లను అందిస్తోంది. హ్యాండ్‌సెట్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.
* దీంతోపాటు నిన్న శాంసంగ్ మరో 5G ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ A06 5G ను లాంచ్ చేసింది. రూ.10000 ధరలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. గత సంవత్సరం 4G వేరియంట్‌ను లాంచ్ చేయగా.. తాజాగా 5G ను లాంచ్ చేసింది.


Click it and Unblock the Notifications








