Home
Mobile

రూ.10 వేల కంటే తక్కువ ధరలో 5G ఫోన్‌ కోసం చూస్తున్నారా.. 4 సంవత్సరాల అప్‌డేట్స్‌తో!

భారత్‌ లో ఎంట్రీ లెవల్ ఫోన్‌లకు డిమాండ్‌ ఉంటోంది. దీంతో అనేక సంస్థలు ఈ ధర సెగ్మెంట్‌ లో ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్స్‌ కూడా రూ.10 వేలు లేదా అంతకంటే తక్కువ ధరలో ఆకట్టుకొనే డిజైన్, ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. శాంసంగ్ ఈ సంవత్సరం ఈ ధర సెగ్మెంట్‌ లో వివిధ మోడల్స్‌ ను తీసుకొచ్చింది.

శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ ఫోన్ ( Samsung Galaxy F06 5G Smartphone ) ఈ సంవత్సరం తొలిభాగంలో అందుబాటులోకి వచ్చింది. విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.11499 గా ఉండేది. అయితే ప్రస్తుతం డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది.

samsung galaxy F06 5G

ధర, కలర్‌ వేరియంట్స్‌ :
ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ ఫోన్ 4GB/64GB ధర రూ.7,499, 4GB/128GB ధర రూ.7,999, 6GB/128GB ధర రూ.8,999 గా ఉంది. ఎంట్రీ లెవల్‌ లో శాంసంగ్ ఫోన్‌ల కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్‌ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ లను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ లిట్‌ వైలెట్‌, Bahama బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తోంది.

HD+ డిస్‌ప్లే :
శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ ఫోన్‌ ఆకట్టుకొనే డిజైన్‌ తో అందుబాటులో ఉంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ను కలిగి ఉంటుంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ శాంసంగ్ ఎంట్రీ లెవల్‌ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7.0 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు 4 సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని శాంసంగ్ హామీ ఇచ్చింది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరా యూనిట్‌ ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాతో అమర్చి ఉంది.

5000mAh బ్యాటరీ సహా సూపర్ ఫీచర్లు!
ఈ ఫోన్ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ 12 5G బ్యాండ్స్‌ ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు వాయిస్‌ ఫోకస్‌ ఫీచర్‌ ను కూడా కలిగి ఉంది. Knox vault, క్విక్‌ షేర్‌ వంటి ఫీచర్లను కూడా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy F06 5G Smartphone with 4 years of updates at Rs7499 price on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X