Home
Mobile

రూ.9 వేల కంటే తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా..?

శాంసంగ్‌ నుంచి ఇటీవల గెలాక్సీ F70e 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. రూ12999 ప్రారంభ ధరకు అందుబాటులోకి వచ్చింది. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఏకంగా 6 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్‌ OS, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను అందిస్తుంది. అయితే శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ రేపు (ఫిబ్రవరి 25 వ తేదీ) జరగనుంచి. స్మార్ట్‌ఫోన్‌లతోపాటు బడ్స్‌ లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.

అయితే గత సంవత్సరం భారత్‌ మార్కెట్లో శాంసంగ్‌ అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో ఎంట్రీ లెవల్‌ మోడల్స్‌ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల వరకు ఉన్నాయి. రూ.10 వేల కంటే తక్కువ ధరలో శాంసంగ్‌ ఫోన్ల కోసం చూస్తున్నట్లయితే గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy F06 5G Smartphone) మంచి ఆప్షన్‌ అయ్యే అవకాశం ఉంది.

samsung galaxy F06 5G

ప్రారంభ ధర రూ.8999 :
శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.8999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10999 గా ఉంది. ఫ్లి్‌ప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు

HD+ డిస్‌ప్లే, రెండు కలర్‌ వేరియంట్స్‌ :
ఈ ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ బహమా బ్లూ, లిట్‌ వైలెట్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7.0 పైన పనిచేస్తోంది. 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు 4 సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరా యూనిట్‌ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. దీంతోపాటు LED ఫ్లాష్‌ లైట్‌ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 5G, 4G, బ్లూటూత్‌ 5.3, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ 12 5G బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తుందని శాంసంగ్ తెలిపింది. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఉంది. వాయిస్‌ ఫోకస్‌, క్విక్‌ షేర్‌, Knox Vault వంటి ఫీచర్లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy F06 5G smartphone with 4 years of updates now available under rs9000 on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X