Home
Mobile

ధర రూ.8999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌.. సేల్‌ వివరాలు..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ శాంసంగ్ తాజాగా గెలాక్సీ F14 4G వేరియంట్‌ ను (Samsung Galaxy F14 4G Smartphone) లాంచ్‌ చేసింది. ఇప్పటికే ఈ మోడల్‌ 5G మోడల్‌ భారత్‌ మార్కెట్‌ లో అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవల్‌ ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ను శాంసంగ్‌ విడుదల చేసింది. మరియు 50MP ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్‌ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ప్రారంభ ధర రూ.8,999 గా ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ F14 4G స్మార్ట్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
శాంసంగ్‌ గెలాక్సీ F14 4G స్మార్ట్‌ ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌ ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌ సెట్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Samsung Galaxy F14 4G Smartphone launched

ఈ శాంసంగ్ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 ను కలిగి ఉంటుంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 680 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 8GB ర్యామ్‌తో (4GB + 4GB) జతచేయబడుతుంది. ర్యామ్‌ ప్లస్‌ ఫీచర్‌ ద్వారా ర్యామ్‌ ను విస్తరించుకొనే అవకాశం ఉంది. రెండు OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను పొందనుంది.

శాంసంగ్‌ గెలాక్సీ F14 4G స్మార్ట్‌ ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది ఈ వేరియంట్ ధర రూ.8999 గా ఉంది. ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. మరియు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్ మూన్‌లైట్‌ సిల్వర్‌, పెప్పర్‌మింట్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. f1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాలను కలిగి ఉంది. తక్కువ కాంతిలనూ నాణ్యమైన ఫోటోలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు 2MP డెప్త్‌ సెన్సార్‌, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చారు.

శాంసంగ్‌ గెలాక్సీ F14 4G స్మార్ట్‌ ఫోన్‌ కనెక్టివిటీ పరంగా డ్యూయల్ 4G VoLTE, వైఫై, బ్లూటూత్‌ 5.2, GPS ఫీచర్‌లు ఉన్నాయి. భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్‌ కొనుగోలు సమయంలో ఛార్జర్‌ ను కూడా ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F14 4G Smartphone launched with 50MP Camera in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X