Home
Mobile

శాంసంగ్‌ గెలాక్సీ F15 5G ఎయిర్‌టెల్‌ ఎడిషన్ విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ధర, సేల్ వివరాలు..!!

శాంసంగ్ నుంచి ఈ సంవత్సరం మార్చిలో శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy F15 5G Airtel Edition) విడుదల అయింది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ ఎయిర్‌టెల్‌ ఎడిషన్‌ను సంస్థ విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ F15 5G ఎయిర్‌టెల్‌ ఎడిషన్‌ కొనుగోలుపై 50GB కూపన్‌ సహా 7 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 18నెలలపాటు ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డు మాత్రమే వినియోగించాలి. మరియు కనీసం రూ.199 రీఛార్జి చేయాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ముగిసిన 15 రోజుల్లోగా రీఛార్జ్‌ చేయించాల్సి ఉంటుంది. లేకుంటే స్మార్ట్‌ఫోన్‌ లాక్ చేయబడుతుంది.

శాంసంగ్ గెలాక్సీ F15 5G ఎయిర్‌టెల్‌ ఎడిషన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. 4GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ.12,249, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,749, 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.15,249 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

Samsung Galaxy F15 5G Airtel Edition

శాంసంగ్‌ గెలాక్సీ F15 5G ఎయిర్‌టెల్‌ ఎడిషన్‌ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్‌ గెలాక్సీ F15 5G ఎయిర్‌టెల్‌ ఎడిషన్‌ 6.5 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 1080*2340 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణ పొందుతుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 5.0 OS ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4 సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌ మరియు 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది.

కెమెరా స్పెసిఫికేషన్ల పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 5MP, 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్‌ 13MP కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ వస్తుందని సంస్థ చెబుతోంది. 25 గంటలపాటు వీడియో ప్లేబ్యాక్‌ టైంను కలిగి ఉంటుందని శాంసంగ్‌ చెబుతోంది. 5G, USB-C, బ్లూటూత్‌ 5.3, వైఫై సపోర్టుతో లాంచ్‌ అయింది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy F15 5G Airtel Edition Smartphone launched in india sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X