Home
Mobile

వాయిస్‌ ఫోకస్‌ ఫీచర్‌, 6000mAh బ్యాటరీతో శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌.. ధర వివరాలు లీక్.. !

శాంసంగ్‌ గెలాక్సీ F15 5G (Samsung Galaxy F15 5G) మరియు శాంసంగ్‌ గెలాక్సీ M14 4G (Samsung Galaxy M14 4G) స్మార్ట్‌ ఫోన్లు భారత్‌లో త్వరలో లాంచ్‌ కానున్నాయి. గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్‌ మార్చి 4వ తేదీ నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని సంస్థ ఇప్పటికే ప్రకటన చేసింది. ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చని శాంసంగ్‌ వెల్లడించింది.

తాజాగా శాంసంగ్‌ గెలాక్సీ F15 5G మరియు గెలాక్సీ M14 4G స్మార్ట్‌ ఫోన్ల ధరల వివరాలు లీక్‌ అయ్యాయి. టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ ఈ రెండు స్మార్ట్‌ ఫోన్ల వివరాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను X ద్వారా వెల్లడించారు. దీని ఆధారంగా గెలాక్సీ F15 5G స్మార్ట్‌ ఫోన్‌ 4GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.13,499 మరియు 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ రూ.14,999 గా ఉంటుందని తెలుస్తోంది.

Samsung Galaxy F15 5G and Galaxy M14 4G price leaked

బ్యాంకు కార్డులపై రూ.1500 తగ్గింపు : టిప్‌స్టర్ నివేదిక ప్రకారం బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు శాంసంగ్‌ గెలాక్సీ M14 4G 4GB ర్యామ్‌ + 64GB అంతర్గత స్టోరేజీ ధర రూ.9499 గా ఉంది. అలాగే 6GB ర్యామ్‌ + 128GB ధర రూ.12,499 గా ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌ ల్యాండింగ్‌ పేజీ ఆధారంగా గెలాక్సీ F15 5G స్మార్ట్‌ ఫోన్‌ మార్చి 4 నుంచి సేల్‌లో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ పేజీ ఆధారంగా ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌ మరియు వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా, USB-C పోర్టు, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌ వంటి ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy F15 5G and Galaxy M14 4G price leaked

సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ : ఈ F-సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ వస్తుందని సంస్థ చెబుతోంది. ఈ ఫోన్‌ 5G, డ్యూయల్‌ సిమ్‌ను సపోర్టు చేస్తుందని సమాచారం. విడుదలకు ముందు ఈ ఫోన్‌ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

వాయిస్‌ ఫోకస్‌ ఫీచర్‌ సహా కీలక ఫీచర్‌ : దీంతోపాటు ఈ స్మార్ట్‌ ఫోన్‌ వాయిస్‌ ఫోకస్‌ ఫీచర్‌ మరియు నాలుగు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్లు మరియు ఐదు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని శాంసంగ్‌ సంస్థ తెలిపింది. అయితే ఈ ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F15 5G and Galaxy M14 4G smartphone price details leaked ahead of launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X