Home
Mobile

ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ కొత్త వేరియంట్ విడుదల..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ మరో వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ సంవత్సరం మార్చి నెలలో శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy F15 5G New Variant) లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉండగా తాజాగా 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను విడుదల చేసింది.

శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ ఫోన్‌ కొత్త 8GB ర్యామ్‌ ధర రూ.15999 గా ఉంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.12,999 మరియు 6GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.14,499 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను యాష్‌ బ్లాక్‌, గ్రూవీ వైలెట్‌, జాజీ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

Samsung Galaxy F15 5G sale

బ్యాంకు ఆఫర్లు లేదా అప్‌గ్రేడ్ బోనస్ కింద రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా బేస్‌ వేరియంట్‌ నుంచి మొదలు ఈ మూడు వేరియంట్లను రూ.11,999, రూ.13,499, రూ.14999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌ సెట్‌ను శాంసంగ్‌ ఇండియా వెబ్‌ సైట్, ఫ్లిప్‌ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ ఫోన్ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్‌ గెలాక్సీ F15 5G హ్యాండ్‌ సెట్‌ 6.5 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 1080*2340 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది.

Samsung Galaxy F15 5G sale

ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 5.0 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4 సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌ మరియు 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది.

కెమెరా స్పెసిఫికేషన్ల పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 5MP, 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ ఫోన్‌ 13MP కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్ 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ వస్తుందని సంస్థ చెబుతోంది. 25 గంటలపాటు వీడియో ప్లే బ్యాక్‌ టైంను కలిగి ఉంటుందని శాంసంగ్‌ చెబుతోంది. 5G, USB-C, బ్లూటూత్‌ 5.3, వైఫై సపోర్టును కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy F15 5G smartphone New Ram variant launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X