6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజీ శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్‌పైన డిస్కౌంట్.. పూర్తి వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఇటీవల కాలంలో తన అనేక హ్యాండ్‌సెట్‌ల ధరను తగ్గించింది. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy F15 5G Smartphone) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల ధరలో పోలిస్తే 18 శాతం తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ పుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే సహా 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు 128GB అంతర్గత స్టోరేజీతో వచ్చింది.
ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది. బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు ధరను పొందవచ్చు. HDFC బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా హ్యాండ్‌సెట్ ధర రూ.11,999 గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
శాంసంగ్ గెలాక్సీ F15 5G హ్యాండ్‌సెట్ 6.5 అంగుళాల పుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్, 1080*2340 పిక్సల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు డిస్‌ప్లే రక్షణతో అందుబాటులో ఉంది.
శాంసంగ్ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. గరిష్ఠంగా 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీతో అందుబాటులో ఉంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 5.0 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 4 సంవత్సరాలపాటు OS అప్‌డేట్ మరియు 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని సంస్థ వెల్లడించింది.

శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా మరియు 5MP సహా 2MP కెమెరాలను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 13MP కెమెరాను కలిగి ఉంది. మరియు వెనుకవైపు వైపు LED ఫ్లాష్ లైట్‌తో వచ్చింది.
ఈ శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. రెండు రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని సంస్థ హామీ ఇస్తోంది. మరియు 25 గంటలపాటు వీడియో ప్లే బ్యాక్ టైంను కలిగి ఉంటుందని శాంసంగ్ పేర్కొంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది. మరియు కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G VoLTE, వైఫై 802.11, బ్లూటూత్ 5.3, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








