Home
Mobile

ఫ్లిప్‌కార్ట్ సేల్‌.. ధర రూ.11,999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.5 అంగుళాల FHD+ డిస్‌ప్లే శాంసంగ్‌ ఫోన్‌!

శాంసంగ్‌ నుంచి ఈ సంవత్సరం మార్చి నెలలో శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ ఫోన్‌ (Samsung Galaxy F15 5G Smartphone Sale) విడుదల అయింది. బడ్జెట్‌ రేంజ్‌ లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను పొందనుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ను ఫ్లిప్‌కార్ట్‌ లో తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2024 (Flipkart Big Saving Days Sale 2024) నడుస్తోంది. ఈ సేల్‌ ఈనెల 25 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌ లో భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.11,999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13499 గా ఉంది.

Samsung Galaxy F15 5G smartphone

దీంతోపాటు 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డుల ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. యాష్‌ బ్లాక్‌, గ్రూవీ వైలెట్‌, జాజీ గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల వివరాలు :
గెలాక్సీ F15 5G హ్యాండ్‌సెట్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.5 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్ డిస్‌ప్లే 2340*1080 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ ను కలిగి ఉంది.

ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 5.0 ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు మరియు 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను పొందనుందని శాంసంగ్‌ తెలిపింది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా సహా 5MP + 2MP కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్ 13MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ ఫోన్‌ (Samsung Galaxy F15 5G Smartphone) 5G, డ్యూయల్‌ 4G voLTE, బ్లూటూత్‌ 5.3, Wi-Fi 802, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌ సెట్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ ను అమర్చారు

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F15 5G smartphone Gets price drop on flipkart big saving days sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X