రూ.15,000 కంటే తక్కువ ధరకే 6000mAh బ్యాటరీతో Samsung ఫోన్.. విడుదల ఎప్పుడంటే..!
శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F15 5G Smartphone) త్వరలో భారత్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గెలాక్సీ F14 5G స్మార్ట్‌ఫోన్ తర్వాత వెర్షన్ ఫోన్‌గా వస్తుందని తెలుస్తోంది. అయితే పాత మోడల్ కంటే గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ అనేక అప్‌గ్రేడ్‌లతో రానుంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి.
తాజాగా శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ తాజాగా సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఫలితంగా ప్రమోషనల్ ఫొటోలు సహా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. దాంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ధర మరియు కలర్ ఆప్షన్‌ల వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలు మీకోసం.

టిప్‌స్టర్ ముకుల్ శర్మ X పోస్టు ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. మరియు ఈ ఫోన్ రూ.15,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, పర్పల్, సీ గ్రీన్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
ముకుల్ శర్మ తెలిపిన వివరాలు ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ నాలుగు జనరేషన్‌ల ఆండ్రాయిడ్ అప్‌డేట్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కొన్ని నివేదికల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC చిప్‌సెట్‌తో 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో జతచేయబడుతుందని తెలుస్తోంది. శాంసంగ్ A సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో ఉండే వాయిస్ ఫీచర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫోన్ కాల్స్ మాట్లాడిన సమయాల్లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌తో ఇబ్బంది లేకుండా మెరుగైన వాయిస్ అందించేందుకు ఈ ఫీచర్ పనిచేస్తుంది.
*శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌లో త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. మైస్మార్ట్‌ప్రైస్ ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్‌లో SM-A356E మోడల్ నంబర్‌లో కనిపించింది. దీని ఆధారంగా ఈ శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OneUI OSను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
Exynos 1380 SoC చిప్ ARM Mail G68 GPU మరియు 8GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల 120Hz పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 25W వైరడ్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, దీంతోపాటు 8MP, 5MP కెమెరాలను కలిగి ఉంటుంది. 13MP సెల్ఫీ కలిగి ఉండే అవకాశం ఉంది.
అయితే ఈ శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్ ఫోన్ ఎప్పుడు విడుదల కానుందనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అలాగే ఏయే ర్యామ్, స్టోరేజీ వేరియంట్లులో విడుదల కానుందనే సమాచారం కూడా బయటకు రాలేదు. అయితే ఈ హ్యాండ్‌సెట్ Awesome ఐస్‌బ్లూ, Awesome లిలక్, Awesome నేవీ రంగుల్లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








