Home
Mobile

6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజీతో శాంసంగ్‌ 5G స్మార్ట్‌ఫోన్.. ఈ బ్యాంకు కార్డుతో రూ.1000 తగ్గింపు!

శాంసంగ్‌ తన కొత్త స్మార్ట్‌ ఫోన్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ ఫోన్‌ను (Samsung Galaxy F15 5G Smartphone) విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ 6100+ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు నాలుగు సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌ పొందవచ్చని శాంసంగ్‌ వెల్లడించింది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్పెసిఫికేషన్లు : శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ ఫోన్ 6.5 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. F15 5G స్మార్ట్‌ ఫోన్ 4GB ర్యామ్‌ + 128GB మరియు 6GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

Samsung Galaxy F15 5G Smartphone launched in india

నాలుగు సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు : శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ మరియు 6GB ర్యామ్‌ మరియు 128GB స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB స్టోరేజీని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 14 OS ఆధారిత OneUI పైన పనిచేస్తుంది. నాలుగు సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు ఇస్తామని శాంసంగ్ సంస్థ వెల్లడించింది.

6000mAh బ్యాటరీ: శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 5MP, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. దీంతో సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాలను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ సహా 5Gకి సపోర్టు చేస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Samsung Galaxy F15 5G Smartphone launched in india

శాంసంగ్‌ గెలాక్సీ F15 5G ధర :
శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ ఫోన్‌ 4GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.15,999 గా ఉంది. అదే 6GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.16,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ జాజీ గ్రీన్ (Jazzy Green) మరియు గ్రూవీ వైలెట్‌ (Groovy Violet) రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

రూ.1000 తక్షణ తగ్గింపు : శాంసంగ్‌ గెలాక్సీ F15 5G హ్యాండ్‌సెట్‌ను ప్రముఖ ఈ-కామర్స్‌ అమెజాన్‌లో ఇవాళ సాయంత్రం 7PM నుంచి కొనుగోలు చేయవచ్చు. HDFC బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. 4 సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు ఇవ్వనున్నట్లు శాంసంగ్ సంస్థ పేర్కొంది.

Samsung Galaxy F15 5G Smartphone launched in india

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F15 5G Smartphone launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X