50MP కెమెరా, 6 సంవత్సరాల అప్‌డేట్స్, 5000mAh బ్యాటరీ శాంసంగ్ 5G ఫోన్‌పైన రూ.3000 తగ్గింపు..!
శాంసంగ్ ఇండియా నుంచి ఈ సంవత్సరంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. రూ.10 వేల ధర రేంజ్‌లోనూ అనేక మోడల్స్‌ను విడుదల చేసింది. దీంతోపాటు మిడ్ రేంజ్, ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ సంవత్సరం మార్చి నెలలో విడుదల అయిన శాంసంగ్ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F16 5G Smartphone) విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13499 గా ఉండేది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16499 గా ఉండేది.

గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. 4GB ర్యామ్ వేరియంట్‌ను రూ.10749 ధరకు సొంతం చేసుకోవచ్చు. అంటే రూ.2750 డిస్కౌంట్‌ను పొందవచ్చు. 6GB ర్యామ్ వేరియంట్‌ను రూ.11999 కే సొంతం చేసుకోవచ్చు. అంటే రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
8GB ర్యామ్ వేరియంట్‌ను రూ.13499 కే సొంతం చేసుకోవచ్చు. ఈ వేరియంట్ పైనా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సె్స్ బ్యాంకు కార్డులతో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ వైబింగ్ బ్లూ, బ్లింగ్ బ్లాక్, గ్లామ్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
6 సంవత్సరాల అప్‌డేట్స్ :
శాంసంగ్ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ తో పనిచేస్తోంది. ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌తోపాటు, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
5000mAh బ్యాటరీ :
ఈ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
50MP + 13MP (సెల్ఫీ) కెమెరా :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో లెన్స్‌లతో అందుబాటులోకి వచ్చింది. మరియు ముందువైపు 13MP కెమెరాను అమర్చారు. 5G, 4G, బ్లూటూత్ 5.3, WiFi, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
* శాంసంగ్ నుంచి భారత్ మార్కెట్‌లోకి త్వరలో గెలాక్సీ M36 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ శాంసంగ్ ఇండియా సపోర్టు పేజీలో కనిపించింది. గత నెలలోనే గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లోనూ కనిపించింది. దీని ఆధారంగా ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 Skin పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కాలేదు.
గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.


Click it and Unblock the Notifications








