ధర రూ.13000 ధరలో 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లే శాంసంగ్ 5G ఫోన్..!
శాంసంగ్ ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అనేక మోడళ్ల ఫోన్‌లను లాంచ్ చేసింది. గెలాక్సీ S25 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు సహా గెలాక్సీ M06, M16 5G, F06 5G, A06 5G స్మార్ట్‌ఫోన్‌లు సహా గెలాక్సీ A56, A36 వంటి మోడళ్లు కూడా ఇటీవల లాంచ్ చేసింది. తాజాగా మిడ్ రేంజ్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ F16 5G పేరుతో ఈ ఫోన్ (Samsung Galaxy F16 5G Launched) లాంచ్ అయింది.
గత సంవత్సరం లాంచ్ అయిన గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ కు తర్వాత వెర్షన్‌గా ఇవాళ గెలాక్సీ F16 5G మోడల్‌ను విడుదల చేసింది. తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చినా.. అనేక మెరుగైన ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది.

గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల ఫుల్ HD+ (1080*2340 పిక్సల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజీ స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 1.5TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందనుందని శాంసంగ్ హామీ ఇచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా చూస్తే వెనుక వైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ధరలో మెరుగైన కెమెరాలను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.3, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టు. QZSS, Glonass, GPS, Beidou, Galileo వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 11 5G బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తుంది. మరియు 191 గ్రాముల బరువు ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.11,499 గా ఉంది. బ్యాంక్ డిస్కౌంట్‌లతో ఈ ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ధరల వివరాలపై రేపు స్పష్టత రానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13999 గా ఉంటుందని తెలుస్తోంది.
అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉండే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి (13) సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. వైబింగ్ బ్లూ, బ్లింగ్ బ్లాక్, గ్లా్‌మ్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








