రూ.10 వేల ధరలో 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌తో శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్.. ఆకట్టుకొనే ఫీచర్లు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ శాంసంగ్ నుంచి ప్రస్తుతం బడ్జెట్ రేంజ్ లో అనేక ఫోన్‌లు ఉన్నాయి. సుమారుగా రూ.10 వేల ధర లో ఫోన్ కావాలనుకొనే వారికి శాంసంగ్ లో అనేక మోడల్స్ ఉన్నాయి. అయితే శాంసంగ్ ఈ సంవత్సరం తొలి రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F16 5G Smartphone) అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలో లాంచ్ అయింది. ఈ ఫోన్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్ ఫుల్ HD+ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ లో మరొక అంశం అనేక మందిని ఆకట్టుకొనే అవకాశం ఉంది. ఈ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను పొందుతుంది. ఈ ఫోన్ ఫీచర్లు. ధర, సేల్ పూర్తి వివరాలు.

విడుదల సమయంలో ధరలు :
శాంసంగ్ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16499 గా ఉండేది. అయితే ఇటీవల ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో వచ్చింది.
సుమారు రూ.10 వేల ధర రేంజ్‌లో :
ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ వేరియంట్ ను రూ.10749, 6GB ర్యామ్ వేరియంట్ ను రూ.11999, 8GB ర్యామ్ వేరియంట్‌ను రూ.13499 ధరకు అందుబాటులో ఉంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు.
డిస్‌ప్లే వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వైబింగ్ బ్లూ, బ్లింగ్ బ్లాక్, గ్లామ్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

6 సంవత్సరాల వరకు వినియోగించుకోవచ్చు..! :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. అంటే ఈ ఫోన్‌ను 6 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకోవచ్చు.
బ్యాటరీ, కెమెరా ఫీచర్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. మరియు ముందు వైపు 13MP కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications







