ఒకే స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ సంవత్సరాలపాటు ఉపయోగించే అలవాటు ఉందా..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ ఈ సంవత్సరం బడ్జెట్ ధరలో అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో A, M, F సిరీస్ మోడల్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం తొలి భాగంలో శాంసంగ్ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. రూ.15 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
శాంసంగ్ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F16 5G Smartphone) విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16499 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి 2025 సేల్‌లో భాగంగా డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 4GB/128GB వేరియంట్ ధర రూ.12499 గా ఉంది. 6GB/128GB వేరియంట్ ధర రూ.13999, 8GB/128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15499 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా SBI కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 తో పనిచేస్తోంది. ఈ ఫోన్‌లో ఏకంగా 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ సంవత్సరాల పాటు ఉపయోగించే అలవాటు ఉన్న వ్యక్తులకు ఈ ఫోన్ అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోన్ 6 సంవత్సరాల వరకు అన్ని రకాల అప్‌డేట్స్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చి ఉంటుంది. సర్కిల్ టూ సెర్చ్ వంటి ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ తోపాటు ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చి ఉంటుంది. ట్యాప్ అండ్ పే ఆప్షన్‌తో శాంసంగ్ వ్యాలెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ వైబింగ్ బ్లూ, బ్లింగ్ బ్లాక్, గ్లామ్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.


Click it and Unblock the Notifications








