రూ.14499 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌తో 5G స్మార్ట్‌ఫోన్..!
Samsung Galaxy F17 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి బడ్జెట్ రేంజ్‌లో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇటీవలే గెలాక్సీ A17 విడుదల కాగా.. ఇవాళ గెలాక్సీ F17 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ సన్నిని డిజైన్‌తోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ శాంసంగ్ గెలాక్సీ F17 5G స్మార్ట్‌ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ F17 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రీప్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ HD+ ఇన్ఫినిటీ U సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. నియో బ్లాక్, వైలెట్ పాప్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
గెలాక్సీ F17 5G స్మార్ట్‌ఫోన్ Exynos 1330 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 6GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత (Out of the box) One UI 7 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ట్రిపుల్ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చారు.

5000mAh బ్యాటరీ :
గెలాక్సీ F17 5G స్మార్ట్‌ఫోన్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గూగుల్ జెమిని, సర్కిల్ టూ సెర్చ్ వంటి AI ఫీచర్లను కలిగి ఉంది. భద్రత కోసం ఫేస్ అన్‌లాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చారు.
కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, బ్లూటూత్ 5.3, వైఫై 5, USB-C ఛార్జింగ్ పోర్టు, OTG, GPS, NFC వంటి ఫీచర్లను కలిగి ఉంది. శాంసంగ్ ట్యా్ప్ అండ్ పే ఫీచర్‌తో కూడిన వాలెట్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ F17 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఈ గెలాక్సీ F17 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14499 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది.
ఈ ఫోన్ ను HDFC బ్యాంకు కార్డులు, UPI లావాదేవీలపై రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు 6 నెలల వరకు నో EMI ప్రయోజనాలను పొందవచ్చు. శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








