Home
Mobile

శాంసంగ్‌ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వచ్చేసింది.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు..!

Samsung Galaxy F36 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్‌ నుంచి గత నెలలో శాంసంగ్‌ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఈ నెల 12 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం అయింది. అయితే ఈ వారంలో శాంసంగ్‌ నుంచి మరో ఫోన్‌ విడుదల కానుంది. శాంసంగ్ గెలాక్సీ F36 5G పేరు అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ గురించి ఇప్పటికే కొన్ని వివరాలు వెల్లడి కాగా.. తాజాగా విడుదల తేదీ వెల్లడయింది.

ఎప్పుడు విడుదల కానుంది :
శాంసంగ్ తాజా ప్రకటన ఆధారంగా గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్‌ జులై 19 న విడుదల కానుంది. ఈ ఫోన్ సేల్‌ ప్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభం కానుంది. మరియు ఇందుకు సంబంధించిన ఫ్లిప్‌కార్ట్‌ మైక్రోసైట్‌ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉంటుందని సంస్థ చెబుతోంది.

samsung galaxy F36 5G smartphone

ఫ్లిప్‌కార్ట్ మైక్రో సైట్ ఆధారంగా ఈ ఫోన్‌ ఫోటోలు విడుదల అయ్యాయి. ఈ ఫోన్‌ రెడ్‌ మరియు డీప్‌ పర్పుల్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. వెనుక వైపు వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌తో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ 7.7mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ రూ.20000 ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి రానుంది.

50MP కెమెరా :
ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు మరో రెండు కెమెరాలను కలిగి ఉంటాయి. వాటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

చిప్‌సెట్! :
సంస్థ ఇటీవల వెల్లడించిన వివరాల ఆధారంగా గెలాక్సీ F36 5G Flex Hi- FAI స్మార్ట్‌ఫోన్‌ గా ఉంటుంది. గూగుల్‌ ప్లే లిస్టింగ్ ఆధారంగా Exynos 1380 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 6GB ర్యామ్‌తో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS ను కలిగి ఉంటుంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
గత నెలలో విడుదల అయిన శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌ తరహాలోనే జులై 19 న విడుదల కానున్న గెలాక్సీ F36 5G ఏకంగా 6 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్ మరియు 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుందని తెలుస్తోంది.

ఈ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Image Clipper, Object Eraser, Edit Suggestions వంటి అనేక AI ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఇటీవల వచ్చిన ఫోన్‌ వివరాలు :
ఇటీవల అందుబాటులోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.18999 గా ఉంది. ఈ ఫోన్‌ను శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ Exynos 1380 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది. ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.

కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 5MP మ్యాక్రో కెమెరాలతోపాటు 12MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. గూగుల్‌ జెమిని, సర్కిల్‌ టూ సెర్చ్‌, Object Eraser, Image Clipper, Edit Suggestions వంటి ఫీచర్లున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy F36 5G smartphone launch date teased in india here are the specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X