రూ.15999 కే శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6 సంవత్సరాల అప్‌డేట్స్..!
Samsung Galaxy F36 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి తాజాగా గెలాక్సీ F36 5G విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 7.7mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.1500 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ ఇన్ఫినిటీ U సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ 7.7mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

ప్రాసెసర్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ Exynos 1380 ప్రాసెసర్, Mali G68 MP5 GPU ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ప్రస్తుతం రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
6 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌తోపాటు 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని తెలిపింది. సర్కిల్ టూ సెర్చ్, AI Edit Suggestion, Gemini Live, Object Eraser, Image Clipper వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కలిగి ఉంది.
50MP OIS :
కెమెరా విభాగం పరంగా ఈ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 2MP మ్యాక్రో సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ట్యాప్ అండ్ పే తో శాంసంగ్ వాలెట్, శాంసంగ్ Knox Vault, వాయిస్ ఫోకస్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G (SA / NSA), 4G LTE, బ్లూటూత్ 5.3, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,499 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా SBI, ICICI, HDFC, యాక్సెస్ బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
దీంతోపాటు కూపన్ రూ.500 ద్వారా అదనపు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.15999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ జులై 29 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








