Home
Mobile

తక్కువ ధరలో 6 సంవత్సరాల సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ శాంసంగ్‌ ఫోన్‌ సేల్‌ ప్రారంభం

Samsung Galaxy F36 5G Smartphone Sale : శాంసంగ్‌ నుంచి ఇటీవల గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ సేల్‌ ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌ సెట్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను అందిస్తుంది. మరియు 50MP కెమెరాతోపాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్‌ పూర్తి స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్ల వివరాలు.

శాంసంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్ ను శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17,499, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.18,999 గా ఉంది. శాంసంగ్ వెబ్‌సైట్‌ లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

samsung galaxy F36 5G Smartphone display

డిస్‌ప్లే వివరాలు :
గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్ కోరల్‌ రెడ్‌, ఒనిక్స్ బ్లాక్‌, Luxe వైలెట్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 7.7mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.7 అంగుళాల FHD+ ఇన్ఫినిటీ U సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ + ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
గెలాక్సీ హ్యాండ్‌సెట్‌ Exynos 1380 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు Mali G68 MP5 GPU ను కూడా అమర్చారు. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తుంది. 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

samsung galaxy F36 5G Smartphone display

AI సహా ఇతర ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ సర్కిల్‌ టూ సెర్చ్, AI Edit Suggestion, Gemini Live, Object Eraser, Image Clipper వంటి AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఫీచర్లను కలిగి ఉంది. వీటితోపాటు ట్యాప్‌ అండ్‌ పే ఆప్షన్‌తో శాంసంగ్‌ వాలెట్‌, శాంసంగ్ Knox Vault, వాయిస్ ఫోకస్‌ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌, 2MP మ్యాక్రో సెన్సార్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ కెమెరాల ద్వారా 4K వీడియో రికార్డింగ్‌ చేయవచ్చు.

samsung galaxy F36 5G Smartphone display

శాంసంగ్‌ గెలాక్సీ F36 స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.3, Wi-Fi, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్‌ సెన్సర్‌ ను అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy F36 5G Smartphone sale is live in india here is the price and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X