Home
Mobile

శాంసంగ్ నుంచి త్వరలో మిడ్ రేంజ్‌ ధరలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్‌ నుంచి త్వరలో రెండు మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ లు లాంచ్‌ కానున్నాయి. గూగుల్‌ ప్లే కన్సోల్‌ డేటాబేస్‌ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ డేటాబేస్‌ లో శాంసంగ్ గెలాక్సీ F36 స్మా్ర్ట్‌ఫోన్‌ తోపాటు శాంసంగ్‌ గెలాక్సీ M36 స్మార్ట్‌ఫోన్‌ కూడా ఉంది. ఈ రెండు మోడల్స్‌ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ F36 స్మార్ట్‌ఫోన్ :
దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ F36 స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F36 Smartphone) స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి. దీని ఆధారంగా ఈ ఫోన్‌ వాటర్‌ డ్రాప్‌ స్టైల్‌ డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. గూగుల్‌ ప్లే కన్సోల్‌ లిస్టింగ్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ Exynos 1380 చిప్‌సెట్‌ పనిచేస్తుందని సమాచారం.

Samsung Galaxy m36

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7 తో పనిచేసే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. డిస్‌ప్లే వివరాలు వెల్లడి కాకపోయినా.. 1080 x 2340 పిక్సల్స్‌ రిజల్యూషన్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

గెలాక్సీ M36 స్మార్ట్‌ఫోన్‌ :
శాంసంగ్‌ గెలాక్సీ F36 హ్యాండ్‌సెట్‌తోపాటు గెలాక్సీ M36 మోడల్‌ (Samsung Galaxy M36 Smartphone) కూడా లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌ లోనే గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌లో ఈ మోడల్ కనిపించింది. దీని ఆధారంగా ఈ ఫోన్‌ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది.

ఈ లిస్టింగ్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ Exynos చిప్‌సెట్‌తో పనిచేస్తుందని సమాచారం. అమెజాన్ వివరాల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ M35 5G :
ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.13499 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ రూ.14999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.17999 గా ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌ 6.6 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టాకోర్‌ Exynos 1380 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6 OS ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 8MP, 2MP కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు ముందువైపు 13MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. విడుదల ధరతో పోలిస్తే ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy F36 spotted on google play console and Galaxy M36 smartphone teased on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X