Home
Mobile

Samsung Galaxy F41 మొదటి సేల్ నేడే!! రూ.1500 ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్లతో...

శామ్సంగ్ సంస్థ ఈ నెల ప్రారంభంలో ఇండియాలో విడుదల చేసిన శామ్సంగ్ గెలాక్సీ F41 ఫోన్ యొక్క అమ్మకాలు మొదటిసారిగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సందర్భంగా మొదలుకానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ లో లభించే వివిధ రకాల డిస్కౌంట్ ఆఫర్లతో దీనిని కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచబడింది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ స్నాపర్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, ఎక్సినోస్ 9611 SoC వంటి ఫీచర్లను కలిగిన ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ F41 ఫ్లిప్‌కార్ట్ ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ F41 ఫ్లిప్‌కార్ట్ ధరల వివరాలు

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ F41ను రెండు వేరియంట్ లలో విడుదల చేసింది. ఇందులో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ యొక్క ధర రూ.15,499 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ యొక్క ధర రూ.16,499. ఇది ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో ఫ్యూజన్ గ్రీన్, ఫ్యూజన్ బ్లూ మరియు ఫ్యూజన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలలో ఈ ఫోన్ మీద రూ. 1,500 ధర తగ్గింపును అందిస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో గెలాక్సీ F41 మీద డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో గెలాక్సీ F41 మీద డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో భాగంగా శామ్‌సంగ్ గెలాక్సీ F41 కొనుగోలు మీద వినియోగదారులకు అదనంగా ప్రీపెయిడ్ లావాదేవీలపై రూ.1,000 డిస్కౌంట్ మరియు SBI కస్టమర్లకు మరో 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్ కూడా ఆఫర్‌లో ఉంది. దీని ద్వారా వినియోగదారులు ఫోన్ ధరలో 70 శాతం చెల్లించి గెలాక్సీ ఎఫ్ 41 ను సొంతం చేసుకోగలుగుతారు. క్రెడిట్ కార్డులు మరియు క్రెడిట్ కార్డ్ EMI ల ద్వారా చేసిన పేమెంట్ ల కోసం ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. 12 నెలల వ్యవధి తరువాత వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయవచ్చు మరియు కొనుగోలు చేసిన ఫోన్‌ను తిరిగి ఇవ్వవలసి ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ F41 ఆండ్రాయిడ్ 10 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ F41 ఆండ్రాయిడ్ 10 స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ F41 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 లో వన్ యుఐ కోర్ తో రన్ అవుతుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-HD + సూపర్ అమోలేడ్ ఇన్ఫినిటీ-U డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 6GB LPDDR4x RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి ఉండి Exynos 9611 SoC చేత శక్తిని పొందుతుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి మెమొరిని 512GB వరకు విస్తరించడానికి  ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంది.  

 

శామ్సంగ్ గెలాక్సీ F41 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

శామ్సంగ్ గెలాక్సీ F41 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

శామ్సంగ్ గెలాక్సీ F41 స్మార్ట్ ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.  ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ స్నాపర్ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా మరియు లైవ్ ఫోకస్ సపోర్ట్‌తో 5 మెగాపిక్సెల్ సెన్సార్ మూడవ కెమెరాను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ షూటర్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ F41 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

శామ్‌సంగ్ గెలాక్సీ F41 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

శామ్‌సంగ్ గెలాక్సీ F41 ఫోన్ యొక్క ఇతర కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును ఇస్తూ 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ సామ్‌సంగ్ ఫోన్ వెనుకవైపున ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అదనంగా కలిగి ఉంటుంది. ఫోన్ యొక్క  కనెక్టివిటీ ఎంపికలలో 4 జి ఎల్‌టిఇ, వై-ఫై 802.11ac, బ్లూటూత్ 5.0, జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ మరియు 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.


More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F41 First Sale Starts on Flipkart Big Billion Days Sale: Price, Specs, Discount Offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X