Home
Mobile

ఈ కొత్త Samsung 5G ఫోన్, సేల్ ఈరోజే మొదలైంది! ధర, ఆఫర్ల వివరాలు

By Maheswara

శాంసంగ్ గెలాక్సీ F54 5G భారతదేశంలో ఈరోజు మొదటిసారిగా అమ్మకానికి సిద్ధంగా ఉంది. గెలాక్సీ F54 5G ఈ నెల ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ చేయబడింది. మరియు భర్త దేశం యొక్క అత్యంత పోటీ మార్కెట్లో 30 వేల లోపు ధర విభాగంలో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

ఇది Exynos చిప్‌సెట్ తో, భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్, శక్తివంతమైన అమోలెడ్ డిస్‌ప్లే మరియు క్లాస్ లీడింగ్ సాఫ్ట్‌వేర్ మద్దతును కలిగి ఉంది.

Samsung Galaxy F54 5G Sale Live In India Via Flipkart, Price, Specifications And Offers Details Here.

శాంసంగ్ గెలాక్సీ F54 5G సేల్, భారతదేశంలో ధర వివరాలు
భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ F54 5G ధర 8GB/256GB మోడల్‌కు రూ.29,999గా నిర్ణయించబడింది. వినియోగదారులు HDFC లేదా SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి F54 5Gపై రూ. 2,000 వరకు అదనపు తగ్గింపు ఆఫర్ ను పొందవచ్చు. శాంసంగ్ నో కాస్ట్ EMI చెల్లింపు ఆఫర్లను కూడా అందిస్తోంది.

భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ F54 5G సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు మొదలైంది . ఫ్లిప్కార్ట్ , Samsung.com మరియు ఇతర రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా ఇది లాంచ్ కాబోతోంది. శాంసంగ్ గెలాక్సీ F54 రెండు రంగుల ఎంపికలలో వస్తుంది. అవి, Meteor Blue మరియు స్టార్ డస్ట్ సిల్వర్.

శాంసంగ్ గెలాక్సీ F54 5G స్పెసిఫికేషన్ల వివరాలు
శాంసంగ్ గెలాక్సీ F54 5G స్మార్ట్ ఫోన్ 8GB RAM మరియు 256GB స్టోరేజీ తో జత చేయబడిన Exynos 1380 SoC ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. అంతేకాకుండా, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. శాంసంగ్ యొక్క తాజా గెలాక్సీ F సిరీస్ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది మరియు విజన్ బూస్టర్ టెక్నాలజీతో వస్తుంది.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, గెలాక్సీ F54 OIS తో 108MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ షూటర్ మరియు 2MP మాక్రో యూనిట్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇక ముందు భాగంలో, గెలాక్సీ F54 5G ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ బాక్స్‌తో వన్ UI 5.1తో వస్తుంది.

అలాగే, శాంసంగ్ నాలుగు OS అప్‌డేట్‌లు మరియు పరికరంతో ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్ లను వాగ్దానం చేస్తుంది. గెలాక్సీ F54 5G స్మార్ట్ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్లో Wi-Fi 6, 5G, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, స్టీరియో స్పీకర్లు, NFC మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

ఇటీవల ఫ్లిప్కార్ట్, శాంసంగ్ గెలాక్సీ S22 ప్లస్ 5g స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్ తో అందిస్తోంది. ఈ ఫోన్ ధర ఇప్పుడు గణనీయంగా తగ్గింది. శాంసంగ్ యొక్క ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S22+ 5G ఫోన్ ఫ్లిప్కార్ట్ సేల్ లో బంపర్ ఆఫర్ పొందుతోంది. కస్టమర్లు ఈ రూ.లక్ష విలువైన ఈ ఫోన్‌ని సగం ధరకే కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy F54 5G Sale Live In India Via Flipkart, Price, Specifications And Offers Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X