108MP కెమెరా, 256GB స్టోరేజీ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. సేల్ పూర్తి వివరాలు..!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి ఇటీవల గెలాక్సీ F55 5G స్మార్ట్ ఫోన్ (Samsung Galaxy F54 5G Smartphone Price Drop) భారత్ మార్కెట్‌లోకి విడుదల అయింది. ఈ హ్యాండ్ సెట్ మెరుగైన స్పెసిఫికేషన్ లు, ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే తాజాగా శాంసంగ్ గెలాక్సీ F54 5G స్మార్ట్‌ఫోన్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల ధరతో పోలిస్తే ఈ హ్యాండ్‌సెట్‌ను అమెజాన్‌లో 36 శాతం డిస్కౌంట్‌కు కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్ లో రూ.22,999 గా ఉంది. ఆకట్టుకొనే డిజైన్ సహా మెరుగైన స్పెసిఫికేషన్ లు, ఫీచర్ లను కలిగి ఉంటుంది. మరియు భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. 25W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ F54 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
శాంసంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ సూపర్ అమోలెడ్ + డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2400 పిక్సల్ రిజల్యూషన్, 85 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో, 20:9 యాస్పెక్ట్ రేషియో, 393 పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది.
4 OS అప్‌డేట్‌లు, 5 ఏళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
ఈ శాంసంగ్ గెలాక్సీ F54 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 5.1 OS తో పనిచేస్తుంది. మరియు అండర్ ది హుడ్ Exynos 1380 చిప్‌సెట్ ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ కు నాలుగు OS మరియు 5 ఏళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని సంస్థ హామీ ఇచ్చింది.

108MP ప్రధాన కెమెరా :
ఈ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 108MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మ్యాక్రో లెన్స్ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 32MP కెమెరాను కలిగి ఉంది.
6000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 25W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.3, వైఫై 5, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications