Home
Mobile

108MP కెమెరా తో శాంసంగ్ కొత్త 5G ఫోన్ లాంచ్ ! ధర, సేల్ వివరాలు

By Maheswara

శాంసంగ్ గెలాక్సీ F54 భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఆల్ రౌండర్ ఫోన్ క్యాటగిరీ లో లాంచ్ అయిన ఇటీవలే ప్రకటించిన గెలాక్సీ A34 ధరకు ఇది చాలా దగ్గరగా ఉంది. ఈ కొత్త Samsung Galaxy F54 స్మార్ట్ ఫోన్ భారీ బ్యాటరీ, డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మధ్య-శ్రేణి Exynos చిప్ సెట్ తో, ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ F54 ధర మరియు సేల్ వివరాలు
శాంసంగ్ గెలాక్సీ F54 భారతదేశంలో ప్రారంభ ధర రూ. 27,999 కి లాంచ్ అయింది. ఇది 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర. ఇది కొన్ని గంటల్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా జూన్ 6 మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులోకి వస్తుంది మరియు అదే ప్లాట్‌ఫారమ్ ద్వారా త్వరలో సేల్ జరుగుతుంది. ఇది భారతదేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా కూడా అందుబాటులో ఉంచబడుతుంది.

Samsung Galaxy F54 5G With 108MP Camera And 6000mAh Battery Launched In India. Price And Sale Details

శాంసంగ్ గెలాక్సీ F54 స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు
ఈ కొత్త శాంసంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో భారీ 6.7-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది పూర్తి HD+ రిజల్యూషన్‌తో పనిచేసే అమోలెడ్ ప్యానెల్‌ను అందిస్తుంది. దీని స్క్రీన్ దెబ్బతినకుండా రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్‌ను కలిగి ఉంది. వెనుక కెమెరా డిజైన్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S23 ని పోలి ఉంటుంది.

ఇది కంపెనీ యొక్క ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇదే చిప్ సెట్ ఇటీవల లాంచ్ చేసిన గెలాక్సీ A34 ఫోన్ కి కూడా శక్తినిస్తుంది. ఈ 5G ఫోన్ సరికొత్త Android 13 OS లో రన్ అవుతోంది. శాంసంగ్ 4 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లను మరియు 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ ప్యాచ్‌లను అందజేస్తుందని ప్రకటించింది.

ఇక ఈ ఫోన్ యొక్క కెమెరా వివరాలు గమనిస్తే, వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ప్యాక్ చేస్తుంది. ఇది స్థిరీకరించిన వీడియోల కోసం OISకి మద్దతుతో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో కలిసి ఉంటుంది. ముందు భాగంలో, సింగిల్ సర్క్యులర్ కట్ అవుట్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉంది.

ఇంకా, పెద్ద 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది ఫోన్‌ను ఒక రోజు కంటే ఎక్కువ సమయం పనిచేసేలా చేస్తుంది. ఇది కంపెనీ యొక్క 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కి మద్దతును అందించింది. ఇది మార్కెట్‌లో ఇతర ఫోన్‌లు అందిస్తున్న దానికంటే చాలా తక్కువ. అయితే,ఈ ఫోన్ చార్జర్ తో పాటు సేల్ చేయబడదు. అంటే వినియోగదారులు చార్జర్ ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా, మీ దగ్గర ఇదివరకే శాంసంగ్ చార్జర్ ఉంటే వాడుకోవచ్చు.

ఇంకా, శాంసంగ్ సంస్థ ఈ ఫోన్‌తో పాటు కేసును కూడా ఇవ్వదు.ఈ కొత్త శాంసంగ్ ఫోన్ గెలాక్సీ A54 స్మార్ట్‌ఫోన్‌లో కనిపించే ఇన్-డిస్ప్లే సెన్సార్‌కు బదులుగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కు ఒకే స్పీకర్‌ను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy F54 5G With 108MP Camera And 6000mAh Battery Launched In India. Price And Sale Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X