శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ డిజైన్, కలర్ వేరియంట్‌లు లీక్.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్..!!
శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F55 5G Smartphone) భారత్‌లో త్వరలో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ మరియు కలర్ వేరియంట్ వివరాలు వెల్లడయ్యాయి. వేగాన్ లెదర్ ఫినిష్‌తో కూడిన రెండు రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ Apricot Crush మరియు Raisin Black రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. మరియు ఇప్పటికే వచ్చిన టీజర్ ఆధారంగా ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. మరియు స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ సన్నని మరియు తక్కువ బరువు కలిగిన వేగాన్ లెదర్ ఫోన్‌గా గుర్తింపు పొందుతుందని తెలుస్తోంది.

అయితే ఈ శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్... గెలాక్సీ C55 రీబ్రాండెడ్ వెర్షన్‌గా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ చైనాలో ఏప్రిల్‌లో విడుదల అయింది. టిప్‌స్టర్ నివేదిక ప్రకారం ఈ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ +128GB స్టోరేజీ, 8GB ర్యామ్ +256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లో విడుదల కానుందని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ F55 5G అంచనా స్పెసిఫికేషన్లు :
గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్ F55 హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల పుల్ HD+ సూపర్ అమోలెడ్ + డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ శాంసంగ్ గెలాక్సీ F55 5G హ్యాండ్‌సెట్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ 4 సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని తెలుస్తోంది.
కెమెరా విభాగానికి వస్తే టీజర్ ఆధారంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP, 8MP, 2MP కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
కనెక్టివిటీ పరంగా శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ 5.3, వైఫై 5, USB-C పోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై శాంసంగ్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే ఈ నెలలోనే విడుదల కానుందని తెలుస్తోంది. కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కాలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








