Home
Mobile

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.10,000 తగ్గింపు.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్!

భారత్‌ మార్కెట్‌లో గత సంవత్సరం మే నెలలో శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy F55 5G Smartphone) విడుదల అయింది. స్టైలిష్‌ డిజైన్, వేగాన్ లెదర్‌తో లాంచ్‌ చేసింది. దీంతోపాటు IP67 రేటింగ్‌ మెరుగైన డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌ ఫోన్‌గా నిలిచింది. దీంతోపాటు 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌ తో అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

స్టోరేజీ వేరియంట్స్‌ :
భారత్‌లో ఈ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. విడుదల సమయంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.26,999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy F55 5G Smartphone

ఏకంగా రూ.10,000 డిస్కౌంట్‌ :
అమెజాన్‌లో ప్రస్తుతం 8GB/128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉంది. అంటే సుమారుగా రూ.10000 ధర తగ్గింది. 8GB/256GB స్టోరేజీ ధర రూ.18,999, 12GB/256GB స్టోరేజీ ధర రూ.22,599 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ Apricot crush, Raisin Black కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 OneUI 6.1 OS ను కలిగి ఉంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ Adreno 644 GPU, గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

ఈ శాంసంగ్‌ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1080*2400 పిక్సల్స్‌ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1,000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ బ్యాక్‌ ప్యానల్‌ వేగాన్‌ లెదర్‌తో అందుబాటులోకి వచ్చింది.

50MP ప్రైమరీ కెమెరా :
ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను అమర్చి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ ఏకంగా 50MP కెమెరాను కలిగి ఉంది.

గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. IP67 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌తో ఉంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F55 5G Smartphone gets Rs10,000 price drop on amazon Check specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X