50MP సెల్ఫీ కెమెరా. 5000mAh బ్యాటరీ. 6.7 అంగుళాల డిస్‌ప్లే ఫోన్ పై రూ.10500 వరకు తగ్గింపు..!
శాంసంగ్ సంస్థ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బెస్ట్ బ్రాండ్‌గా ఉంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉన్న బ్రాండ్స్‌లో శాంసంగ్ కూడా ఉంది. ఇటీవల కాలంలో ఈ సంస్థ అనేక ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఈ సంవత్సరం కూడా ఫ్లాగ్‌షిప్, మిడ్‌రేంజ్, ఎంట్రీ లెవల్ లో అనేక మోడల్స్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ రేంజ్ ఫోన్‌లలోనూ ఎక్కువ రోజులపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందిస్తోంది.
గత సంవత్సరం లాంచ్ అయిన శాంసంగ్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. గత సంవత్సరం మే నెలలో గెలాక్సీ F55 5G ఫోన్ (Samsung Galaxy F55 5G Smartphone) లాంచ్ అయింది. ఈ ఫోన్ అనేక బెస్ట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా. IP67 రేటింగ్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు.

స్టోరేజీ వేరియంట్స్ :
శాంసంగ్ గెలాక్సీ F55 5G మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్ అయింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.26999 కి లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.16499 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.10500 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్‌లో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ను రూ.16900, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ సుమారుగా రూ.23000 గా ఉంది. ఈ ఫోన్ Raisin Black, Apricot crush వంటి రెండు రంగుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.
డిస్‌ప్లే వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1,000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. బ్యాక్ ప్యానల్ లెదర్ డిజైన్‌ను కలిగి ఉంది.
చిప్‌సెట్ వివరాలు :
గెలాక్సీ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్ తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్‌తోపాటు Adreno 644 GPU ను కూడా అమర్చారు. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OneUI 6.1 OS తో పనిచేస్తోంది.
కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సామర్థ్యంతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలు కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ కోసం 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని శాంసంగ్ వెల్లడించింది.
ఈ హ్యాండ్‌సెట్ మిడ్‌రేంజ్‌లో విడుదల అయినా ప్రస్తుతం బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులో ఉంది. ఈ ధరలో IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G LTE నెట్‌వర్క్ సపోర్టుతో పాటు భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.


Click it and Unblock the Notifications