Home
Mobile

శాంసంగ్‌ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల తేదీ ఖరారు.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..!

శాంసంగ్ నుంచి భారత్ మార్కెట్‌లోకి త్వరలో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కానుంది. శాంసంగ్‌ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ ఫోన్‌ను ( Samsung Galaxy F55 5G ) మే 17న విడుదల చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.2X999 గా పేర్కొంది. దీని ద్వారా రూ.30000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి రానుంది.

శాంసంగ్‌ గెలాక్సీ F55 5G హ్యాండ్‌ సెట్‌ను ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ ఫాం ఫ్లిప్‌ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌ కార్ట్ ద్వారా ఈ స్మార్ట్‌ ఫోన్‌ డిజైన్‌ మరియు కలర్‌ వేరియంట్‌ వివరాలు వెల్లడయ్యాయి. వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ తో Apricot Crush మరియు Raisin బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

Samsung Galaxy F55 5G Smartphone

ఈ శాంసంగ్‌ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ ఫోన్... గెలాక్సీ C55 రీబ్రాండెడ్ వెర్షన్‌గా లాంచ్‌ కానుందని తెలుస్తోంది. C55 హ్యాండ్‌సెట్ చైనాలో ఏప్రిల్‌లో విడుదల అయింది. టిప్‌స్టర్ నివేదిక ప్రకారం ఈ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లో విడుదల కానుందని తెలుస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ F55 5G అంచనా స్పెసిఫికేషన్లు :
గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్‌ F55 హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్ + డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ మరియు 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ తో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ శాంసంగ్‌ గెలాక్సీ F55 5G హ్యాండ్‌ సెట్‌ స్నాప్ డ్రాగన్ 7 జెన్‌ 1 చిప్‌ సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ 4 సంవత్సరాలపాటు OS అప్‌ డేట్లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌ డేట్‌లను పొందనుందని తెలుస్తోంది.

కెమెరా విభాగానికి వస్తే టీజర్‌ ఆధారంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP, 8MP, 2MP కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ ఫోన్‌ బ్లూటూత్‌ 5.3, వైఫై 5, USB-C పోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌ సెట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై శాంసంగ్‌ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F55 5G Smartphone launch date confirmed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X