ధర రూ.26,999 కి విడుదలైన శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.20800 కే కొనుగోలు చేయవచ్చు..!
శాంసంగ్ నుంచి గత సంవత్సరం మే నెలలో గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F55 5G Smartphone) లాంచ్ అయింది. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. మరియు వేగాన్ లెదర్‌తో ప్రీమియం లుక్ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ అనేక మెరుగైన స్పెసిఫికేషన్ లు, ఫీచర్‌లను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ సహా IP67 రేటింగ్ తో మెరుగైన డస్ట్, వాటర్ రిసిస్టెంట్ గా ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ ల పూర్తి వివరాలు.
మూడు స్టోరేజీ వేరియంట్‌లు :
శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వంటి మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో బేస్ వేరియంట్ ధర రూ.26999 గా ఉంది.

సుమారు రూ.6000 డిస్కౌంట్ :
ప్రస్తుతం అమెజాన్ లో (Amazon) ఈ హ్యాండ్‌సెట్ బేస్ వేరియంట్ ను రూ.20,800 కే సొంతం చేసుకోవచ్చు. 256GB స్టోరేజీ వేరియంట్ ను రూ.23,490 గా ఉంది. 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.26,599 గా ఉంది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత డిస్కౌంట్ ను పొందవచ్చు. Raisin బ్లాక్, Apricot crush రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల (1080*2400 పిక్సల్స్) FHD+ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ బ్యాక్ ప్యానల్ వేగాన్ లెదర్ డిజైన్ తో అందుబాటులో ఉంది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్ తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ Adreno 644 GPU ప్రాసెసర్. గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 OneUI 6.1 OS ను కలిగి ఉంది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్ లు, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్ లను అందిస్తామని శాంసంగ్ తెలిపింది. దీంతోపాటు మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
50MP + 50MP సెల్ఫీ కెమెరా :
గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్ ను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మ్యాక్రో లెన్స్ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 50MP కెమెరాను అమర్చారు.
వాటర్ ప్రూఫ్ :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అందుబాటులో ఉంది. దీంతోపాటు మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను అమర్చారు. IP67 రేటింగ్‌తో మెరుగైన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.


Click it and Unblock the Notifications








