Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 256GB స్టోరేజీతో శాంసంగ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర వివరాలు లీక్‌.. రెండు రోజుల్లో విడుదల...!

శాంసంగ్ నుంచి భారత్‌ మార్కెట్‌లోకి మే 27న శాంసంగ్‌ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌తో సహా వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ను కలిగి ఉంది. ఇప్పటి వరకు ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర లీక్‌ అయింది.

శాంసంగ్‌ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy F55 5G Smartphone) 6.7 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 2400*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ కానుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్‌ వేగాన్ లెదర్‌ ఫినిష్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

Samsung Galaxy F55 5G Smartphone price tipped

ఈ శాంసంగ్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI పైన పనిచేస్తుందని తెలుస్తోంది. నాలుగు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చని తెలుస్తోంది. స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 1 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 12GB ర్యామ్‌ మరియు 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Samsung Galaxy F55 5G Smartphone price tipped

ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డాల్బీ అ‌ట్మా్స్‌ సపోర్టు, బ్లూటూత్‌ 5.3, వైఫై, GPS, NFC వంటి ఫీచర్లతో విడుదల కానుంది. అయితే ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై కొన్నింటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ ధరపై ఇప్పటికే టీజర్‌ ద్వారా హింట్‌ ఇచ్చింది. రూ.30 వేల కంటే తక్కువ ధరకే బేస్‌ వేరియంట్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. అయితే తాజాగా టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ ఈ హ్యాండ్‌సెట్‌ ధరను అంచనా వేశారు. దీని ప్రకారం ఈ శాంసంగ్‌ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉండనుంది.

మరియు 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ ధర రూ.29,999 గా ఉండే అవకాశం ఉంది. అదే 12GB ర్యామ్ +256GB స్టోరేజీ ధర రూ.32999 గా ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.2000 తగ్గింపునిచ్చే అవకాశం ఉందని తెలిసింది. దీనిపై శాంసంగ్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు.

దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ Apricot Crush మరియు Raisin Black రంగుల్లో లభిస్తుంది. మరియు శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌ సహా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. భారత్ మార్కెట్‌లో మే 27న విడుదల చేయనున్నట్లు తెలిపింది. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F55 5G Smartphone price leaked ahead of launch on may 27 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X