Home
Mobile

శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ టీజర్‌ విడుదల.. ట్రిపుల్ కెమెరా, తొలిసారి వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌తో..!!

శాంసంగ్‌ నుంచి త్వరలో గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy F55 5G) లాంచ్‌ కానుంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను శాంసంగ్‌ విడుదల చేసింది. అయితే ఈ హ్యండ్‌ సెట్‌ మే నెల తొలి రోజుల్లో విడుదల కానుందని తెలుస్తోంది. తొలిసారిగా వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ను ఈ శాంసంగ్‌ గెలాక్సీ F55 5G కలిగి ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ C55 5G స్మార్ట్‌ఫోన్‌కు త్వరలో విడుదల కానున్న F55 5G హ్యాండ్‌సెట్‌ రీబ్రాండెడ్ వెర్షన్‌గా తెలుస్తోంది. అయితే ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌ శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌ మరియు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy F55 5G smartphone

టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్ ఆధారంగా గెలాక్సీ M55 5G తరహా ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌.. చిన్న అప్‌గ్రేడ్‌లతో గెలాక్సీ M55 5G తరహా స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.

శాంసంగ్‌ గెలాక్సీ F55 5G అంచనా స్పెసిఫికేషన్లు :
గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్‌ F55 హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్ + డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ మరియు 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

ఈ శాంసంగ్‌ గెలాక్సీ F55 5G హ్యాండ్‌సెట్‌ స్నాప్ డ్రాగన్ 7 జెన్‌ 1 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ 4 సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని తెలుస్తోంది.

కెమెరా విభాగానికి వస్తే టీజర్‌ ఆధారంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP, 8MP, 2MP కెమెరాల సహా 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ. 12GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

దీంతోపాటు శాంసంగ్‌ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదే కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.3, వైఫై 5, USB-C పోర్టును కలిగి ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. వీటిపై శాంసంగ్‌ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F55 5G smartphone teased in india expected to launch early may
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X