Home
Mobile

6.7 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, వేగాన్‌ లెదర్‌ డిజైన్‌తో శాంసంగ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌.. రేపే విడుదల..!

శాంసంగ్‌ నుంచి భారత్‌ మార్కెట్‌లోకి రేపు (మే 17) గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy F55 5G) విడుదల కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్‌ కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ అనేక మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే వేగాన్ లెదర్‌ ఫినిష్‌తో వస్తుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ మరియు యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా లైవ్‌ వీక్షించవచ్చు.

ఈ హ్యాండ్‌కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు ఇటీవల లీక్‌ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్‌ వేగాన్ లెదర్‌ ఫినిష్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ Apricot Crush మరియు Raisin Black రంగుల్లో లభిస్తుంది. మరియు శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌ సహా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy F55 5G smartphone will be launching on tomorrow

శాంసంగ్‌ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD + సూపర్‌ అమోలెడ్‌+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 2400*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ కానుందని సమాచారం.

దీంతోపాటు ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI hపైన పనిచేస్తుందని తెలుస్తోంది. 4 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చని తెలుస్తోంది. స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 1 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 12GB ర్యామ్‌ మరియు 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది.

Samsung Galaxy F55 5G smartphone will be launching on tomorrow

ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డాల్బీ అ‌ట్మా్స్‌ సపోర్టు, బ్లూటూత్‌ 5.3, వైఫై, GPS, NFC వంటి ఫీచర్లతో విడుదల కానుంది. అయితే ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై కొన్నింటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

హ్యాండ్‌సెట్‌ ధర రూ.30000 కంటే తక్కువకే అందుబాటులోకి వస్తుందని టీజర్‌ ద్వారా సంస్థ వెల్లడించింది. అయితే తాజాగా వచ్చిన ఓ లీక్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.26999 గా ఉంటుంది. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.29999 గా ఉంటుంది. అదే 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.32999 గా ఉంటుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F55 5G smartphone will be launching on tomorrow specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X