శాంసంగ్ గెలాక్సీ F56 5G స్మార్ట్‌ఫోన్ విడుదల.. 50MP కెమెరా, 6 సంవత్సరాల అప్‌డేట్స్..!
Samsung Galaxy F56 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ మే 13 వ తేదీన గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ గురించి కీలక వివరాలు వెల్లడయ్యాయి. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌లతో అత్యంత సన్నని ఫోన్‌గా ఇది గుర్తింపు పొందనుంది. అయితే తాజాగా శాంసంగ్ మిడ్ రేంజ్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ భారత్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. గెలాక్సీ F సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ F56 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
శాంసంగ్ గెలాక్సీ F56 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే విజన్ బూస్టర్ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ కేవలం 7.2mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉంది.

గెలాక్సీ F56 5G స్మార్ట్‌ఫోన్ Exynos 1480 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB LPDDR5X ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు మరో రెండు కెమెరాలను కలిగి ఉంది. ముందు వైపు 12MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగంగా బిగ్ పిక్సల్ టెక్, AI ఆధారిత ఇమేజింగ్ టూల్స్‌ను కలిగి ఉన్నాయని శాంసంగ్ తెలిపింది. ఈ ఫీచర్లు తక్కువ కాంతిలోనూ మెరుగైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయవచ్చని చెబుతోంది. దీంతోపాటు Object Eraser మరియు Edit Suggestions వంటి AI ఎడిటింగ్ టూల్స్ కూడా ఉన్నాయి.
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ సెక్యూరిటీ కోసం knox Vault ఫీచర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు శాంసంగ్ వాలెట్ ను కూడా కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F56 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999 గా ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఈ ధరలకు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ఈ గెలాక్సీ F56 5G స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సేల్ ప్రారంభం అయింది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌లతోపాటు EMI ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ గ్రీన్, వైలెట్ రంగుల్లో లభిస్తుంది.
Image Credit : Samsung


Click it and Unblock the Notifications








