రూ.12999 ధరకు శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్.. అనేక సూపర్ ఫీచర్లు..!
Samsung Galaxy F70e Smartphone Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ గత వారం భారత్ మార్కెట్ లో గెలాక్సీ F70e స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. గెలాక్సీ F70 సిరీస్ లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ అయింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6 సంవత్సరాల అప్‌డేట్స్ ను పొందుతుంది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
రూ.12999 ప్రారంభ ధరకు :
శాంసంగ్ గెలాక్సీ F70e 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది.

HD+ డిస్‌ప్లే, లెదర్ ఫినిష్ :
శాంసంగ్ గెలాక్సీ F70e 5G ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 260 ppi పిక్సల్స్ డెన్సిటిని కలిగి ఉంది. ఈ ఫోన్ స్పాట్‌లైట్ బ్లూ, లైమ్ లైట్ గ్రీన్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. బ్యాక్ ప్యానల్ ప్రీమియం లెదర్ ఫినిష్ ను కలిగి ఉంది.
ఆండ్రాయిడ్ 16 OS :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 6GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. దీంతోపాటు ARM Mali G57 GPU కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 OS పైన పనిచేస్తోంది.
50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 25W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP54 రేటింగ్ తో డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంది.
ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ Knox Vault, Quick Share వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
* ఫిబ్రవరి 25 వ తేదీ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2026 జరగనుంది. ఇందులో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌తోపాటు బడ్స్ కూడా విడుదల కానున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








