Home
Mobile

6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌!

Samsung Galaxy F70e Smartphone Launch : శాంసంగ్‌ నుంచి ఇవాళ భారత్‌ మార్కెట్‌ లో గెలాక్సీ F70e స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ డిజైన్‌ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు ఈ ఫోన్‌ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఇవాళ విడుదల కానున్న ఫోన్ గురించి చిప్‌సెట్‌, బ్యాటరీ సహా అనేక వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి.

గెలాక్సీ F70e స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌ ఆధారంగా గెలాక్సీ F70e స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లైమ్‌ లైట్‌ గ్రీన్‌, స్పాట్‌ లైట్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది. ఈ ఫోన్ బ్యాక్‌ ప్యానల్‌ లెదర్ ఫినిష్‌ ను కలిగి ఉంటుంది.

Samsung galaxy F70e Smartphone

మీడియాటెక్‌ చిప్‌, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌ 623k AnTuTu స్కోర్‌ ను కలిగి ఉందని చెబుతోంది. ఆండ్రాయిడ్ ఆధారిత One Ui 8 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఏకంగా 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని శాంసంగ్‌ చెబుతోంది.

డ్యూయల్‌ కెమెరా యూనిట్‌ :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP అల్ట్రా క్లియర్‌ ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు అనేక ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

Samsung galaxy F70e Smartphone

6000mAh బ్యాటరీ :
ఈ గెలాక్సీ F70e స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. IP54 రేటింగ్‌ తో డస్ట్‌, స్ప్లాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ వాయిస్‌ ఫోకస్, Knox Vault వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 12 5G బ్యాండ్స్‌ ను సపోర్టు చేస్తుంది.

బడ్జెట్ ధర, ఫ్లిప్‌కార్ట్‌ లో సేల్‌ :
భారత్‌ మార్కెట్‌ లో గెలాక్సీ F70e స్మార్ట్‌ఫోన్‌ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనా వివరాల ఆధారంగా రూ.10000 నుంచి రూ.15000 ధర మధ్యలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. సేల్‌ సహా ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ అందుబాటులోకి వస్తుంది.

* ఈ ఫిబ్రవరి నెలలో గెలాక్సీ A37 5G, A57 5G స్మార్ట్‌ఫోన్‌ లు కూడా విడుదల కానున్నాయని ఇటీవల లీక్స్‌ వచ్చాయి. దీంతోపాటు శాంసంగ్‌ S26 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ లు కూడా ఈ నెలలోనే అందుబాటులోకి వస్తాయని లీక్స్‌ వస్తున్నాయి. అయితే శాంసంగ్ మాత్రం అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.

Best Mobiles in India

English summary
Samsung galaxy F70e Smartphone with 6000mAh battery, 6 years of updates launching today
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X