భలే ఆఫర్.. రూ.11999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌తో 5G స్మార్ట్‌ఫోన్!
శాంసంగ్ నుంచి మార్చి 17 వ తేదీన గెలాక్సీ M17e ఫోన్ విడుదల కానుంది. అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS, 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 50MP కెమెరాలో లాంచ్ కానుంది.
గత నెలలోనే విడుదల.. అంతలోనే డిస్కౌంట్ ఆఫర్ :
భారత్ మార్కెట్‌లో ఫిబ్రవరి నెలలో అందుబాటులోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ F70e 5G స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy F70e Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది. తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చినా.. ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది.

రూ.1000 డిస్కౌంట్‌తో :
విడుదల సమయంలో గెలాక్సీ F70e 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.1000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.
రూ.11999 ప్రారంభ ధరకు :
ప్రస్తుతం ఈ ఫోన్‌ను రూ.11999, రూ.13999 ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్పాట్‌లైట్ బ్లూ, లైమ్‌లైట్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. రూ.12 వేల ధరలో మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ హ్యాండ్‌సెట్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
HD+ డిస్‌ప్లే :
శాంసంగ్ గెలాక్సీ F70e 5G ఫోన్ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 260 ppi పిక్సల్స్ డెన్సిటిని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ బ్యాక్ ప్యానల్ ప్రీమియం లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌ను కలిగి ఉంది. ARM Mali G57 GPU కూడా ఉంది. ఈ చిప్ 6GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
6000mAh బ్యాటరీ, 50MP కెమెరా :
ఈ ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. 25W వైర్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరా ఉంది. ఈ ఫోన్ క్విక్ షేర్, Knox Vault వంటి ఫీచర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ పరంగా ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్ 5G, 4G, వైఫై, బ్లూటూత్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ లైమ్ లైట్ గ్రీన్, స్పాట్‌లైట్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








