Home
Mobile

శాంసంగ్ నుంచి బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌ఫోన్‌.. మీడియాటెక్‌ ప్రాసెసర్‌, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా!

Samsung Galaxy F70e Smartphone : శాంసంగ్‌ నుంచి ఇటీవల కీలక ప్రకటన వచ్చింది. గెలాక్సీ F70 సిరీస్‌ నుంచి త్వరలో స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేస్తామని ఇటీవల వెల్లడించింది. అయితే తాజాగా అందుకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి. గెలాక్సీ F70e స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ సహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలను శాంసంగ్ షేర్‌ చేసింది. ఈ ఫోన్‌ మెరుగైన హార్డ్‌వేర్‌ స్పెసిఫికేషన్‌లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.

ఎప్పుడు విడుదల కానుంది? :
శాంసంగ్ గెలాక్సీ F70e స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో ఫిబ్రవరి 9 వ తేదీన విడుదల కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి వస్తుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌ ఆధారంగా ఈ ఫోన్ డిజైన్‌ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి.

Samsung Galaxy F70e smartphone

కలర్‌ వేరియంట్స్‌, 6000mAh బ్యాటరీ :
ఫ్లిప్‌కార్ట్‌ మైక్రోసైట్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ లైమ్‌లైట్‌ గ్రీన్‌, స్పాట్‌లైట్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది. ఈ ఫోన్‌ బ్యాక్‌ ప్యానల్‌ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

మీడియాటెక్‌ చిప్‌సెట్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌ 623K AnTuTu స్కోర్‌ను కలిగి ఉందని తెలిపింది. ఈ చిప్‌ 6GB ర్యామ్, 128GB ‌స్టోరేజీ స్టోరేజీని సపోర్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. మైక్రోSD కార్డును సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్‌ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరా ఉంటుంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

బడ్జెట్‌ రేంజ్‌లో అందుబాటులోకి :
ఇటీవల శాంసంగ్ ఈ సిరీస్‌ ధరపై కీలక వివరాలు వెల్లడించింది. గెలాక్సీ F70 సిరీస్‌ మోడల్స్‌ రూ.30 వేల ధర కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అయితే గెలాక్సీ F70e మోడల్ రూ.10,000 నుంచి రూ.15,000 ధర రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

* శాంసంగ్‌ నుంచి గెలాక్సీ S26 సిరీస్‌తోపాటు గెలాక్సీ A37, గెలాక్సీ A57 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయని తెలుస్తోంది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ S26 సిరీస్‌ ను లాంచ్‌ చేస్తుందని తెలుస్తోంది. మిగిలిన రెండు మోడల్స్‌ కూడా ఈ నెలలోనే లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

* శాంసంగ్‌ గెలాక్సీ S26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల QHD+ డైనమిక్‌ అమోలెడ్ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OS పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. కెమెరా విభాగం పరంగా 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy F70e smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X