మతిపోగొడుతున్న సామ్‌సంగ్ కొత్త ఫోన్
Galaxy Feel పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ అనౌన్స్ చేసింది.
Galaxy Feel పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ అనౌన్స్ చేసింది. సెక్సీ లుక్స్‌తో కట్టిపేడేస్తోన్న ఈ ఫోన్ తొలత జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. Opal Pink, మూన్ వైట్ ఇంకా ఇండిగో బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది. స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి..

డిస్‌ప్లే...
Galaxy Feel ఫోన్ 4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తుంది.

ఆపరేటింగ్ సిస్టం
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ సిస్టం పై రన్ అవుతుంది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్
1.6గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

కెమెరా, బ్యాటరీ
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ.

అదనపు ఫీచర్లు..
4జీ వోల్ట్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హై-రెసిస్టెంట్ ఆడియో, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లుటూత్ 4.2, వై-ఫై.

ఫోన్ బరువు, ఇతర అంశాలు..
ఫోన్ చుట్టుకొలత వచ్చేసరికి 138x67x8.3మిల్లీ మీటర్లు, బరువు 135 గ్రాములు. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి ఎటువంటి సమచారం అందుబాటులో లేదు.


Click it and Unblock the Notifications








