Home
Mobile

ఆండ్రాయిడ్‌ 16, Exynos 2400 చిప్‌సెట్‌తో Galaxy Flip 7 FE స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి ఫీచర్ల వివరాలు..!

Samsung Galaxy Flip 7 FE : శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ 2025 ఈవెంట్‌ లో (Galaxy Unpacked 2025) భాగంగా తొలిసారిగా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫ్యాన్ ఎడిషన్‌ ను ఆవిష్కరించింది. శాంసంగ్‌ గెలాక్సీ ఫ్లిప్‌ 7 FE స్మార్ట్‌ఫోన్‌ ను తీసుకొచ్చింది. ఈ ఈవెంట్‌లో భాగంగా గెలాక్సీ Z ఫోల్డ్‌ 7, గెలాక్సీ Z ఫ్లిప్‌ 7 స్మార్ట్‌ఫోన్‌లతోపాటు గెలాక్సీ వాచ్‌ 8 సిరీస్‌ కూడా విడుదల అయింది. గెలాక్సీ ఫ్లిప్‌ 7 FE స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

శాంసంగ్‌ గెలాక్సీ Z ఫ్లిప్‌ FE ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ డైనమిక్ అమోలెడ్‌ 2x ప్రైమరీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2640 x 1080 పిక్సల్‌ రిజల్యూషన్‌ కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ 3.4 అంగుళాల సూపర్‌ అమోడెల్‌ కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Samsung Galaxy Flip 7 FE Smartphone launched

Exynos చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 16 OS :
ఈ గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE స్మార్ట్‌ఫోన్ Exynos 2400 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 పైన పనిచేస్తుంది.

డ్యూయల్‌ కెమెరా యూనిట్ :
ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP వైడ్ యాంగిల్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్‌ లెన్స్‌ను అమర్చి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 10MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 4000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఫ్లిప్ 7 FE స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఫోన్ బ్లాక్‌, వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. గెలాక్సీ Z ప్లిప్‌ 7 తరహాలోనే FE మోడల్‌ కూడా తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 187 గ్రాముల బరువుంటుంది.

* శాంసంగ్‌ గెలాక్సీ ఫ్లిప్‌ 7 స్మార్ట్‌ఫోన్‌ :
ఈ ఫోన్ 6.9 అంగుళాల FHD+ డైనమిక్‌ అమోలెడ్‌ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 4.1 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ ను పొందుతుంది.

గెలాక్సీ Z ఫ్లిప్‌ 7 స్మార్ట్‌ఫోన్‌ Exynos 2500 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత One UI 8 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా (OIS) 12MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 10MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4300mAh బ్యాటరీ తో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలను వెల్లడించలేదు. ఇవాళ్టి నుంచే (జులై 9) ముందస్తు బుకింగ్ (Pre Order) చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. జులై 25 నుంచి భారత్‌ లో సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ బ్లూ షాడో, జెట్‌ బ్లాక్‌, కోరల్‌ రెడ్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. మింట్‌ కలర్‌ వేరియంట్‌ (ఆన్‌లైన్‌ ఎక్స్‌క్లూజిన్‌) గా లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy Flip 7 FE Smartphone launched with Exynos 2400 Chipset in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X