సామ్‌సంగ్ గెలాక్సీ గేర్@రూ.14,999

Posted By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ ‘గెలాక్సీ గేర్'ను గతఏడాది సెప్టంబర్‌లో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదల సమయంలో ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ.22,990. ఈ స్మార్ట్‌వాచ్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవటంతో సామ్‌సంగ్ ఈ వేరబుల్ డివైస్ ధర‌ను 18.999కి తగ్గించింది.

సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ ధర తగ్గిందోచ్!

తాజాగా, ఈ వాచ్‌ ధర మరోసారి తగ్గింది. తాజా ధర తగ్గింపులో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌ను ఔత్సాహికులు రూ.14,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ వివరాలను ముంబయ్‌కు చెందిన ప్రముఖ రిటైలర్ మహేష్ టెలికామ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ("PRICE DROP #samsung #galaxygear NEW PRICE 14999/-").

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది. వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్.

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరింయట్‌లలో లభ్యం కానుంది. 1.9 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, 10 సెకండ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 315ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థ. మీ వాయిస్ ఆధారంగా వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ప్రత్యేకమైన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ, లౌడ్ స్పీకర్.

ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను యువత ఫ్యాషన్ ఉపకరణం‌గానూ ఇంకా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు సహచరుని‌గాను ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ద్వారా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవటంతో డయల్ చేయవచ్చు. ప్రస్తుతానికి గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ గెలాక్సీ నోట్3, ఇంకా గెలాక్సీ నోట్ 10.1 2014 ఎడిషన్‌లను సపోర్ట్ చేస్తుంది.

భవిష్యత్‌లో గెలాక్సీ ఎస్4, గెలాక్సీ ఎస్3 ఇంకా గెలాక్సీ నోట్3లను గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది.గెలాక్సీ గేర్ స్మార్ట్ వాచ్‌లోని 5 అత్యుత్తమ ఫీచర్లు వాయిస్ కాల్స్, ఎస్ వాయిస్ గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్‌కు ఉపకరిస్తుంది. వాచ్‌లోని మరో ఫీచర్ ఎస్ వాయిస్‌తో వాతావరణం, ఆలారమ్ ఇంకా డ్రాఫ్ట్ మెసేజ్‌లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting