ఆన్‌లైన్ మార్కెట్లోకి ‘సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో’

|

మోటరోలా నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన ‘మోటో జీ' స్మార్ట్‌ఫోన్ పాజటివ్ రివ్యూలను సొంతం చేసుకుని అమ్మకాల పరంగా ప్రభంజనం సృష్టిస్తున్న నేపధ్యంలో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన ఆధునిక స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ గ్రాండ్ నియోను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వచ్చే వారం ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను మార్కెట్లో అధికారికంగా విడుదల చేసే అవకాశముంది. ప్రస్తుతం ఈ డివైస్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ themobilestore రూ.18,299కు ఆఫర్ చేస్తోంది. గెలాక్సీ గ్రాండ్ నియో 8 ఇంకా 16జీబి వేరింయట్‌లలో లభ్యంకానుంది.

 
ఆన్‌లైన్ మార్కెట్లోకి ‘సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో’

గెలాక్సీ గ్రాండ్ నియో కీలక స్పెసిఫికేషన్‌లు:

ఫోన్ పరిమాణం 43.7x77.1x9.6 మిల్లీమీటర్లు,
బరువు 163 గ్రాములు,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల టీఎఫ్టీ డబ్యూవీజీఏ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ (8జీబి, 16జీబి),
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
యాక్సిలరోమీటర్, కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X