బడ్జెట్ రేంజ్‌లో సామ్‌సంగ్ VoLTE సపోర్ట్‌ ఫోన్..?

చైనా స్మార్ట్‌ఫోన్‌ల రాకతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టుకొల్పోతున్నట్లు కనిపిస్తోన్న సామ్‌సంగ్ సరికొత్త అస్త్రాలను సిద్ధం చేస్తోంది.

బడ్జెట్ రేంజ్‌లో సామ్‌సంగ్ VoLTE సపోర్ట్‌ ఫోన్..?

ముఖ్యంగా రూ.10,000 కంటే తక్కువ ధర రేంజ్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను టార్గెట్ చేస్తూ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ + పేరుతో ఓ సరికొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. రూ.10,000 కంటే తక్కువ ధర రేంజ్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఈ ఫోన్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం..

Read More : రూ.1000కే VoLTE సపోర్ట్‌ ఫోన్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూడు కలర్ వేరియంట్స్

గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ + మూడు కలర్ వేరియంట్‌లలో అందుటాటులో ఉంటుంది. వాటి వివరాలు బ్లాక్, వైట్ ఇంకా పింక్. ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ అవుతుంది.

డిస్‌ప్లే, ప్రాసెసర్, ర్యామ్

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ స్ర్కీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ రక్షణ కవచంలా ఉంటుంది. మీడియాటెక్ ఎంటీ6737టీ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో పాటు 1.5జీబి ర్యామ్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మూడు స్టోరేజ్ వేరియంట్స్

గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ + ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అవి 8జీబి, 16జీబి, 32జీబి. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరిచుకునే అవకాశం.

కెమెరా విషయానికి వచ్చేసరికి

కెమెరా విషయానికి వచ్చేసరికి గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ + ఫోన్ 8 మెగా పిక్సల్ రేర్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో రానుంది.

డీసెంట్ బ్యాటరీ బ్యాకప్‌, 4జీ VoLTE సపోర్ట్

డీసెంట్ బ్యాటరీ బ్యాకప్‌ను అందించే విధంగా 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు. రిలయన్స్ జియో సిమ్‌ను సపోర్ట్ చేసే విధంగా ఈ ఫోన్ 4జీ VoLTE ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy Grand Prime+: 5 Key Features of the Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot