కింగ్ ఎవరు..?

Posted By: Staff

కింగ్ ఎవరు..?

 

సామ్‌సంగ్ గెలాక్నీనోట్2కు సక్సెసర్ వర్షన్‌గా రూపుదిద్దుకున్న పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ గ్రాండ్ 2013 ఆరంభంలో మార్కెట్లోకి రాబోతోంది. సామ్‌సంగ్, హెచ్‌టీసీ, హవాయి వంటి దిగ్గజ మొబైల్ తయారీ బ్రాండ్‌లు పెద్ద స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌ల పై దృష్టిసారిస్తున్న నేపధ్యంలో కార్బన్, మైక్రోమ్యాక్స్, లావా, ఐబాల్ వంటి దేశవాళీ బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో 5 అంగుళాల డివైజ్‌లను రూపొందిస్తున్నాయి. తాజాగా, కార్బన్ 5 అంగుళాల డిస్‌ప్లే శ్రేణిలో ‘కార్బన్ ఏ30’ పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర రూ.10,990. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్, కార్బన్ ఏ30ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా....

పండుగ ఆఫర్లు.. (టాప్-15)!

బరువు ఇంకా చుట్టుకొలత.......

కార్బన్ ఏ30: చుట్టుకొలత 165 x 90 x 10మిల్లీ మీటర్లు, బరువు 270 గ్రాములు,

గెలాక్సీ గ్రాండ్: చుట్టుకొలత 143.5 x 76.9 x 9.6మిల్లీ మీటర్లు, బరువు 162 గ్రాములు,

డిస్‌ప్లే......

కార్బన్ ఏ30: 5.9 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

గెలాక్సీ గ్రాండ్: 5 అంగుళాల మల్టీ-టచ్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్.....

కార్బన్ ఏ30: 1గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

గెలాక్సీ గ్రాండ్: డ్యూయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం......

కార్బన్ ఏ30: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

గెలాక్సీ గ్రాండ్: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా.....

కార్బన్ ఏ30: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

గెలాక్సీ గ్రాండ్: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్.....

కార్బన్ ఏ30: 2జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

గెలాక్సీ గ్రాండ్: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ......

కార్బన్ ఏ30: వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ,

గెలాక్సీ గ్రాండ్: వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ

ధర.....

కార్బన్ ఏ30: ధర రూ.10,990

గెలాక్సీ గ్రాండ్: తెలియాల్సి ఉంది.

తీర్పు.......

వేగవంతమైన ప్రాసెసర్, మన్నికైన ఫ్రంట్ కెమెరా, అధిక స్టోరేజ్ ఆప్షన్‌లను కోరుకునే వారికి గెలాక్సీ గ్రాండ్ ఉత్తమ ఎంపిక. డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ ఇంకా తక్కువ ధరను ఆశించే వారికి కార్బన్ ఏ30 బెస్ట్ చాయిస్.

కొత్త రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్)!

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot