7 అంగుళాల డిస్‌ప్లేతో సామ్‌సంగ్ Galaxy J Max

|

7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో సామ్‌సంగ్ తన గెలాక్సీ జే మాక్స్ (Galaxy J Max) ఫాబ్లెట్‌ను శుక్రవారం మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ డివైస్ ధర రూ.13,400. నెలాకరు నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

Read More : 22 మెగా పిక్సల్ కెమెరాతో నోకియా ఆండ్రాయిడ్ ఫోన్?

7 అంగుళాల డిస్‌ప్లేతో సామ్‌సంగ్ గెలాక్సీ జే మాక్స్

స్మార్ట్‌ఫోన్‌లలో అసలుసిసలైన ఎంటర్‌టైన్‌మెంట్ అనుభూతులతో పాటు ఆన్ ద గో పోర్టబుల్ కంప్యూటింగ్‌ను కోరుకునే వారికి ఈ మల్టీ పర్సస్ గాడ్జెట్‌ సామ్‌సంగ్ చక్కటి ఆప్షన్. పెద్దదైన డిస్‌ప్లే, శక్తివంతమైన బ్యాటరీ వంటి అత్యాధునిక కూల్ ఫీచర్లు గెలాక్సీ జే మాక్స్‌లో ఉన్నాయి. ఈ డివైస్‌లోని కీలక స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి...

Read More : రిలయన్స్ LYF ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు, 4జీ నెట్‌వర్క్ ఉచితం

డిస్‌ప్లే

డిస్‌ప్లే

గెలాక్సీ జే మాక్స్ ఫాబ్లెట్, 7 అంగుళాల హైడెఫినిషన్ WXGA TFT డిస్‌ప్లేతో వస్తోంది.

ప్రాసెసర్, ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్

ప్రాసెసర్, ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్

1.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

సాఫ్ట్‌వేర్

సాఫ్ట్‌వేర్

గెలాక్సీ జే మాక్స్, ఆండ్రాయిడ్ 5.0.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. సామ్‌సంగ్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఆకట్టుకుంటుంది.

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికి వచ్చేసరికి గెలాక్సీ జే మాక్స్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాతో వస్తోంది. (కెమెరా ప్రత్యేకతలు : ఎఫ్/1.9 అపెర్చుర్, ఎల్ఈడి ఫ్లాష్).

కనెక్టువిటీ ఫీచర్లు

కనెక్టువిటీ ఫీచర్లు

ఈ డ్యుయల్ సిమ్ డివైస్‌లో 4జీ VoLTE, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్ 4.0 వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

గెలాక్సీ జే మాక్స్ ఫాబ్లెట్ 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఫుల్ ఛార్జ్ పై 9 గంటల కంటిన్యూస్ యూసేజ్‌ను ఆస్వాదించవచ్చు.

 అల్ట్రా సేవింగ్ మోడ్

అల్ట్రా సేవింగ్ మోడ్

గెలాక్సీ జే మాక్స్ ఫాబ్లెట్ ప్రత్యేకమైన అల్ట్రా సేవింగ్ మోడ్ ఆప్షన్‌తో వస్తోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా యూజర్లు 50 శాతం వరకు మొబైల్ డేటాను ఆదా చేసుకోవచ్చు. ఫీచర్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌‍లో రన్ అయ్యే అనవసరమైన యాప్స్‌ను అల్ట్రా సేవింగ్ మోడ్ ఆప్షన్‌ ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తూ డేటాను ఆదా చేస్తుంటుంది.

 ఎస్ బైక్ మోడ్

ఎస్ బైక్ మోడ్

గెలాక్సీ జే మాక్స్ ఫాబ్లెట్ ఎస్ బైక్ మోడ్ ఫీచర్‌తో వస్తోంది. డివైస్‌లో ఈ మోడ్‌‌ను ఎనేబుల్ చేసి బైక్ నడుపుతున్నప్పుడు మనకు ఏదైనా కాల్ వచ్చినట్లయితే, మన స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గా కాల్ చేసిన వారికి తర్వాత కాల్ చేయండి అనే మెసేజ్‌ను పంపుతుంది. దీంతో రైడర్స్ మాటిమాటికీ తమ మొబైల్ చూసుకోకుండా డ్రైవింగ్‌పైనే దృష్టి సారించవచ్చు. అదే ఎమర్జెన్సీ అయితే కాల్ చేసిన వారు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఒకటి అంకెను ప్రెస్ చేసినట్లయితే అర్జెంట్ కాల్ అని డ్రైవింగ్ చేస్తున్న వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు బండిని పక్కాగా పార్క్ చేసి కాల్ రిసీవ్ చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ బ్లుటూత్ హెడ్‌సెట్‌ ఉచితం

సామ్‌సంగ్ బ్లుటూత్ హెడ్‌సెట్‌ ఉచితం

గెలాక్సీ జే మాక్స్ ఫాబ్లెట్ కొనుగోలు పై ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.4,500 విలువ చేసే 6 నెలల డబల్ డేటా ప్యాక్‌ను పొందవచ్చు. అంతే కాకుండా సామ్‌సంగ్ బ్లుటూత్ హెడ్‌సెట్‌ను సొంతం చేసుకోవచ్చు. అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ అలానే ఆన్‌లైన్ స్టోర్‌లలో గెలాక్సీ జే మాక్స్ ఫాబ్లెట్ అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy J Max Launched at Rs 13,400: 8 Highlighted Features of the Latest Phablet. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X