తక్కువ ధరతో Samsung Galaxy J2 ( 2018 )వచ్చేస్తోంది !

Written By:

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ జే2ను అతి త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ మేరకు రష్యాలోని BeCompact.ru అనే రీటెయిలర్ వద్ద ఈ ఫోన్ లిస్ట్ అయింది.

షియోమి ఫోన్లపై మరోసారి భారీ డిస్కౌంట్లు, కొనేందుకు ఇదే సదవకాశం !

ఆ రీటెయిలర్ వద్ద ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అలాగే ధరలు లీకయ్యాయి. లీకయిన వివరాల ప్రకారం నలుపు గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ రానుందని దీని ధర కూడా RUB 7,990గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 8860గా ఉండే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ నుంచి షాకింగ్ న్యూస్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లీకయిన స్పెషిఫికేషన్స్ ఇవే

మోడల్‌ నెంబర్‌ ఎస్‌ఎం-జే250ఎఫ్‌తో లిస్టు
5 అంగుళాల క్యూహెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 425 ఎస్‌ఓసీ
క్వాడ్‌-కోర్‌ 1.4గిగాహెడ్జ్‌ సీపీయూ
1.5జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్
8 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా,
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
2600 ఎంఏహెచ్‌ బ్యాటరీ
4G VoLTE, Wi-Fi 802.11 b/g/n,
Bluetooth 4.1, GPS/ A-GPS
Micro-USB

ఎమర్జింగ్‌ మార్కెట్లలో..

అయితే ఈ కంపెనీ ఇంకా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలను ప్రారంభించలేదు. కాగా ఎమర్జింగ్‌ మార్కెట్లలో తొలుత ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వస్తుందని రష్యన్‌ టెక్‌ వర్గాలు చెబుతున్నాయి.

కొత్త గెలాక్సీ జే2లో 16 జిబి స్టోరేజ్..

కాగా అంతకుముందు గెలాక్సీ జే2(2017) కేవలం 8జీబీ స్టోరేజ్‌ మాత్రమే కలిగి ఉంది. ఈ కొత్త గెలాక్సీ జే2లో 16 జిబి స్టోరేజ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

న్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో 2018లో..

వచ్చే నెలలో నిర్వహించనున్న కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో 2018లో తన గెలాక్సీ ఏ సిరీస్‌ల 2018 ఎడిషన్‌ను ప్రదర్శనకు ఉంచాలని శాంసంగ్‌ ప్లాన్‌ చేస్తోంది.

గెలాక్సీ జే2(2017)ను

కాగా గెలాక్సీ జే2(2017)ను ఈ ఏడాది అక్టోబర్‌లోనే శాంసంగ్‌ లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌... 4.7 అంగుళాల క్యూహెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 1.3గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ఎక్సీనోస్‌ ప్రాసెసర్‌, 1జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy J2 (2018) Price, Specifications Revealed via Online Listing Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot