రూ.8190లకే శాంసంగ్ గెలాక్సీ జె2 స్మార్ట్ ఫోన్, భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో

Posted By: M KRISHNA ADITHYA

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఇండియన్ మార్కెట్ లో బడ్జెట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. శాంసంగ్ గెలాక్సీ జే2 పేరిట విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధరను లో ఎండ్ మార్కెట్ కు అనుకూలంగా రూ.8190గా నిర్ణయించింది. ఈ ఫోన్ ఏప్రిల్ 27 నుంచి అందుబాటులోకి రానుంది. ఇక కలర్స్ విషయానికి వస్తే గోల్డ్, బ్లాక్, పింక్ రంగుల్లో మార్కెట్లో ప్రవేశించింది. ఇక జియో సబ్‌స్క్రయిబర్స్ ఎవరైతే శాంసంగ్ గెలాక్సీ జె2 కొంటారో వారు రూ.2750ల క్యాష్ బ్యాంక్ పొందే వీలుంది. ఇందుకోసం జియో 198రూ. లేదా 299 రూ. ప్లాన్ వేయాల్సి ఉంటుంది. అలాగే 10జీబీ 4 జీ డేటా కూడా లభించనుంది. అదికూడా మొదటి 10 రీచార్జీల వరకూ లభిస్తుంది.

మీ ఫోన్‌లో రేడియేషన్ స్థాయి ఎంత? ఇప్పుడే చెక్ చేసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇక గెలాక్సీ జె2 ఫీచర్ల విషయానికి వస్తే

5 అంగుళాల క్యూ హెచ్ డీ సూపర్ అమోల్డ్‌ డిస్‌ప్లే తో పాటు 540x960 పిక్సల్స్ రిజల్యూషన్‌ కలిగిఉంది. ఒక ఆపరేటింగ్ సిస్టం విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ను ఇందులో వాడారు. అలాగే ఇక సామర్థ్యం విషయానికి వస్తే 1.3GHz క్వాడ్-కోర్ ఎక్వైనోస్ ప్రాసెసర్,1జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్,128 జీబీదాకా విస్తరించుకునే సదుపాయం కల్పించారు. దీంతో పాటు కెమెరా విషయంలో 5ఎంపీ బ్యాక్ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2ఎంపీ సెల్ఫీకెమెరాను పొందు పరిచారాు. దీంతో పాటు బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే 2000 ఎంఏహెచ్‌ రిమూవబుల్ బ్యాటరీని వాడారు. అలాగే బ్లూటూత్ వీ 4.2, వైఫై 802.11 ను వాడుతున్నారు.

ఆన్ లైన్ లోనూ, అలాగే ఆఫ్ లైన్ స్టోర్లలోనూ..

ఆన్ లైన్ లోనూ, అలాగే ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈ మొబైల్ ను అందుబాటులో ఉంచినట్లు శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరక్టర్ సుమిత్ వాలియా తెలిపారు. అలాగే సోషల్ మీడియాను విరివిగా వాడే వారి కోసం మూవ్ టు మీడియా అనే ప్రత్యేక ఫీచర్ ను ఇందులో ప్రవేశ పెడుతున్నారు.

జియో కస్టమర్లకు..

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన జియో కస్టమర్లకు జియో రూ.2750 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను ఓచర్ల రూపంలో అందిస్తున్నది. రూ.198 లేదా, రూ.299 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే ఆ ఓచర్లు లభిస్తాయి. దీంతోపాటు వినియోగదారులు తరువాత చేసుకునే 10 రీచార్జిల వరకు ఒక్కో రీచార్జికి గాను 10 జీబీ అదనపు డేటాను అందిస్తారు.

శాంసంగ్ గెలాక్సీ జె2 2018 ఫీచర్లు...

5 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్తే, 960 x 540 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy J2 2018 with Samsung Mall launched in India for Rs. 8,190 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot