సంక్రాంతి బరిలో సామ్‌సంగ్ ఫోన్, రూ.8,490కే

సామ్‌సంగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. గెలాక్సీ జే2 ఏస్ పేరుతో OnlyMobiles.comలో లిస్ట్ అయిన ఈ ఫోన్ ధర రూ.8,490గా ఉంది. మార్కెట్లోకి అందుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. ఈ వెబ్‌సైట్ చెబుతోన్న దాని ప్రకారం గెలాక్సీ జే2 ఏస్ గోల్డ్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Read More : రూ.999కే Jio 4G VoLTE ఫోన్!

సంక్రాంతి బరిలో సామ్‌సంగ్ ఫోన్, రూ.8,490కే

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.. 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్), ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం (వర్షన్ తెలియాల్సి ఉంది), 1.4GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, డ్యుయల్ సిమ్, వై-ఫై హాట్‌స్పాట్, 2600 mAh రిమూవబుల్ బ్యాటరీ (3జీ నెట్ వర్క్ పై 12 గంటల బ్యాటరీ బ్యాకప్).

Read More : రూ.1,999కే Lenovo P2 స్మార్ట్‌ఫోన్

సంక్రాంతి బరిలో సామ్‌సంగ్ ఫోన్, రూ.8,490కే

జనవరి 18న 'గెలాక్సీ సీ9 ప్రో'

సామ్‌సంగ్ న్యూ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన 'గెలాక్సీ సీ9 ప్రో' జనవరి 18న భారత్‌లో లాంచ్ కాబోతోంది. 6 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 653 సాక్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

Read More : రూ.346తో సంవత్సరమంతా ఐడియా 4జీ

సంక్రాంతి బరిలో సామ్‌సంగ్ ఫోన్, రూ.8,490కే

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఫోన్ పరిమాణం 162.9x80.7x6.9మిల్లీ మీటర్లు, బరువు 189 గ్రాములు. మార్కెట్లో గెలాక్సీ సీ9 ప్రో ధర రూ.35,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

Read More : లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై సంక్రాంతి డిస్కౌంట్‌లు

English summary
Samsung Galaxy J2 Ace (G532G) launching soon at Rs 8,490. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot